పీకల్లోతు కష్టాల్లో ఆ హీరోయిన్లు..!
రకుల్ ప్రీత్ సింగ్ టాప్ హీరోలతో పాటు, నాగార్జున లాంటి సీనియర్లతోనూ సినిమాలు చేసింది. అయితే చాలా త్వరగా స్టార్ హీరోయిన్ అయిన రకుల్, 'మన్మథుడు2' తర్వాత ప్రాబ్లమ్స్‌లో పడింది. రకుల్ చాలా ఓల్డ్ లుక్‌లో కనిపించిందనే కామెంట్స్ వచ్చాయి. ఆ తర్వాత వచ్చిన 'చెక్, కొండపొలం' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి. ఈ ఫ్లాపులతో రకుల్‌కి తెలుగులో అవకాశాలు కూడా తగ్గాయి. దీంతో బాలీవుడ్‌నే నమ్ముకుంది రకుల్.
అనుపమ పరమేశ్వరన్ తెలుగు డెబ్యూ 'అఆ'తోనే మంచి మార్కులు తెచ్చుకుంది. 'శతమానం భవతి' లాంటి హిట్స్‌తో బిజీ అయింది. అయితే 'క్రిష్ణార్జునయుద్ధం, తేజ్ ఐ లవ్ యు' లాంటి ఫ్లాపులతో కొంచం వెనకబడింది. ఇక 'రాక్షసుడు' తర్వాత అనుపమకి రెండేళ్లు గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ తర్వాత అనుపమ చేసిన 'రౌడీ బాయ్స్' పెద్దగా మైలేజ్ ఇవ్వలేదు. దీంతో నిఖిల్‌తో చేస్తోన్న '18 పేజెస్,కార్తికేయ2' సినిమాలపైనే ఆశలు పెట్టుకుంది అనుపమ. 'ఆర్.ఎక్స్.100'తో క్రేజీ ఫాలోయింగ్ సంపాదించుకుంది పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమాతో యూత్‌కి ఫుల్‌గా కనెక్ట్ అయ్యింది. అయితే ఆ తర్వాత పాయల్ చేసిన 'వెంకీమామ, డిస్కోరాజా, అనగనగా ఓ అతిథి' సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. పైగా సీనియర్ హీరోయిన్ అనే ఇమేజ్ రావడంతో యంగ్‌స్టర్స్ ప్రిఫర్ చెయ్యట్లేదు. ఇలాంటి సిట్యువేషన్స్‌లో ఆది సాయికుమార్‌తో కలిసి 'కిరాతక' సినిమా చేస్తోంది పాయల్.
అవికా గోర్ 'ఎక్కడికిపోతావ్ చిన్నవాడా' సినిమా తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకుంది. ఓంకార్ దర్శకత్వంలో 'రాజుగారి గది3' చేసింది. అయితే ఈ సినిమా ఆడియన్స్‌ని పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ ఫ్లాప్ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్న అవికా 'బ్రో' సినిమాతో జనాలముందుకొచ్చింది. కానీ ఈ సినిమా కూడా ఫ్లాపుల్లో కలిసిపోయింది. ఇక నాగచైతన్యతో చేసిన 'థ్యాంక్యూ'పైనే ఆశలు పెట్టుకుంది అవికా.
మెహరీన్ పెళ్లి తర్వాత సినిమాలు మానేస్తుందనే టాక్ వచ్చింది. దీంతో మెహరీన్‌ని పక్కనపెట్టేశారు మేకర్స్. కానీ మెహరీన్ కెరీర్ కోసం ఎంగేజ్‌మెంట్‌ని కూడా క్యాన్సిల్ చేసుకుంది. 'ఎఫ్-3'తో పాటు 'మంచిరోజులొచ్చాయి' సినిమాలకి సైన్ చేసింది. అయితే వీటిల్లో 'మంచిరోజులొచ్చాయి' సినిమా బోల్తాపడింది. దీంతో 'ఎఫ్-3' పైనే ఆశలు పెట్టుకుంది మెహరీన్.