బిగ్ బాస్ ఓటిటి : హౌస్ మేట్స్ లిస్ట్ ఇదేనా?

praveen
బుల్లితెర ప్రేక్షకులందరికీ ఎప్పుడూ సరికొత్త ఎంటర్టైన్మెంట్ పంచే బిగ్బాస్ కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది. ఇక బిగ్బాస్ ఐదవ సీజన్ 2 సమయంలో నాగార్జున చెప్పిన విధంగానే కేవలం రెండు నెలల సమయం లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఈసారి టెలివిజన్ వేదికగా కాకుండా ఓటీటీ వేదికగా బిగ్బాస్ విడుదల అవుతూ ఉండడం గమనార్హం. బిగ్ బాస్ ఓటిటి సీజన్ కు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించ బోతుండగా. ఇటీవల ఇక ఈ బిగ్బాస్ ఓటిటి సీజన్కు సంబంధించి ప్రోమో కూడా విడుదల చేశారు.

 బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షో గా కొనసాగుతున్న బిగ్ బాస్ గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కూడా బిగ్ బాస్ ఓటిటి సీజన్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నా కంటెస్టెంట్స్ ఎవరు అన్నదానిపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే కొందరి పేర్లు గత కొన్ని రోజుల మంచి తెగ చక్కెర్లు కొడుతున్నాయి. ఇటీవల విడుదలైన బిగ్బాస్ ఓటిటి  ప్రోమో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈసారి సరికొత్తగా ప్రోమో ప్లాన్ చేశారు.

 మునుపటిలా ఒక గంట కాదు 24 గంటల పాటు బిగ్ బాస్ షో ప్రసారం కాబోతుంది అని చెప్పేశారు. హాట్స్టార్ వేదికగా ఈ షో ప్రారంభం కాబోతోంది. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ఈ షో ప్రారంభం కాబోతున్నది. అయితే గత సీజన్లో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన పాత కంటెస్టెంట్ లను ఇక ఇప్పుడు ఓటిటి సీజన్లో మళ్ళి హౌస్ లోకి పంపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో  బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అరియనాతో పాటు మాజీ కంటెస్టెంట్లు ఆదర్శ్, తనీష్, అఖిల్, అలీ రెజా, హరితేజలు ఉన్నారంటూ టాక్ వినిపిస్తోంది. ఇక వీరితో పాటు.. యాంకర్‌ వర్షిణి, యాంకర్‌ శివ, డ్యాన్స్‌ షో ‘ఢీ-10’ విజేత రాజు, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్‌’వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ వైష్ణవి, సోషల్‌ మీడియా స్టార్‌ వరంగల్‌ వందన, యాకర్‌ ప్రత్యూష పేర్లు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: