చక్రి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన థమన్...!!

murali krishna
పూరి జగన్నాథ్ తన 'బాచి' సినిమాతో చక్రిని సంగీత దర్శకునిగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. తొలి ప్రయత్నంలోనే చక్రి స్వరాలు జనాన్ని బాగా ఆకట్టుకున్నాయి.


ఆ తరువాత వరుసగా పూరి జగన్నాథ్ చిత్రాలకు సంగీతం సమకూరుస్తూ ఒక్కోమెట్టు ఎక్కుతూ ప్రముఖ సంగీత దర్శకుడిగా ఎదిగారు. చక్రి బాణీల్లో ఏదో కొత్తదనం ఉందని భావించిన వారంతా అతని సంగీతం కోసం తెగ పరుగులు తీశారు. చక్రి సైతం తన శక్తివంచన లేకుండా జనం మెచ్చే సంగీతం అందిస్తూ వచ్చారు..


పదేళ్లలోనే 100 సినిమాలకు సంగీతం అందించిన చరిత్ర చక్రికి మాత్రమే సొంతం. 2014లో ఈయన హఠాన్మరణం చెందారు . ఇప్పుడు దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ నెలకొల్పబోతున్న 'సి-స్టూడియోస్ (ద సోల్ఫుల్ మ్యూజిక్ అడ్డ)' లోగోను ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆవిష్కరించారట.ఈ సందర్భంగా తమన్.. చక్రితో కలిసి జర్నీ చేసిన రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు.


''చక్రిగారి వద్దకు మేము వర్క్ చేయడానికి డబ్బు కోసం కాదు ఆయన ప్రేమ కోసం వచ్చేవాళ్లం.. చక్రిగారి తమ్ముడు మహిత్నారాయణ్ మంచి మ్యూజిక్ డైరెక్టర్గా రాణించాలని కోరుకుంటున్నాను. చక్రి పేరు మీద వస్తున్న సి-స్టూడియో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను" అని ఆయన తెలిపారు. ఓ బ్రదర్గా మహిత్ నారాయణ్కు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని  కూడా చెప్పారు.


స్టూడియోను అందరూ ఆదరించాలని ఆయన విజ్ఞప్తి చేశారట. లోగో ట్యాగ్ లైన్ 'సోల్ ఫుల్ మ్యూజిక్ అడ్డ' తనను ఎంతో ఆకట్టుకున్నదని, చక్రి కూడా అందరితో సోల్ఫుల్గా, ఆత్మీయంగా ఉండేవారని థమన్ తెలిపారు.ఆయన ఒళ్లంతా హృదయం ఉండేది. అందరికి భోజనాలు కూడా పెట్టి ఎంతో బాగా చూసుకునేవారు.ఆయన ఈ రోజు మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం అని థమన్ అన్నారు. ఆయన పిలవకపోయిన కూడా అడిగి మరీ ఆయన పని చేసేవాళ్లం అని స్పష్టం చేశారు.


మహిత్ నారాయణ్ మాట్లాడుతూ.. టైం ఇచ్చి లోగోను ఆవిష్కరించినందుకు తమన్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారట.త్వరలోనే హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో స్టూడియో ప్రారంభం కాబోతున్నదని చెప్పారు . అన్నయ్య చక్రి ఆశీస్సులతోపాటు, అందరి ఆశీస్సులు తనకు కావాలని ఆయన కోరారు. స్టూడియో పేరులోని 'సి'లో రెండు 'సి'లు ఉన్నాయని ఇందులో ఒకటి అన్నయ్య చక్రి పేరు, రెండోది మెగాస్టార్ చిరంజీవి పేరు అని, వారిద్దరూ తనకు ఆదర్శమని ఆయన వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: