భీమ్లా నాయక్ : బీ టౌన్ లో సందడి చేయడానికి డేట్ లాక్..!!

Divya
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, రానా దగ్గుబాటి మరొక హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా చిత్రం భీమ్లా నాయక్.. ఇక ఈ సినిమాను మలయాళంలో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియుమ్ అనే సినిమా నుంచి రీమేక్ చేసి తెలుగు ప్రేక్షకులకు మలయాళం సినిమా రుచిని చూపించబోతున్నాడు ప్రముఖ దర్శకుడు సాగర్ కేచంద్ర. ఇప్పటికీ ఈ భీమ్లా నాయక్ సినిమాపై ఎన్నో ఊహాగానాలు ప్రేక్షకులను మొదలయ్యాయని చెప్పవచ్చు అంతేకాదు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకోవడానికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే రానా ఇద్దరూ కలిసి నటించడమే..

ఇక సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ సూర్యదేవర ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం అందరికీ తెలిసిందే కాబట్టి ఇక భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించాలని సన్నాహాలు సిద్ధం చేశారు. ఇకపోతే జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా అలాగే సినిమా ఇండస్ట్రీలో టికెట్ల రేట్లను  కూడా రాష్ట్ర ప్రభుత్వం తగ్గించడంతో ఈ సినిమాను ఫిబ్రవరి 25వ తేదీకి విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది చిత్ర యూనిట్..

ఈ సినిమాకి కూడా లీకుల బెడద తప్పలేదు అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ సినిమా నుంచి పాటలు.. షూటింగ్ .. ఫైట్ షూటింగ్ చివరి షెడ్యూల్లో కొన్ని సన్నివేశాలు కూడా లీక్ అయ్యి  ప్రేక్షకులలో మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇదిలా ఉండగా రామ్ గోపాల్ వర్మ  కోరిన కోరిక మేరకు పవన్ కళ్యాణ్ తన సినిమాను హిందీలో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే.
హిందీ లో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో హిందీ రైట్స్ ని కూడా తాజాగా  అమ్మివేసినట్లు సమాచారం..కాబట్టి సాధ్యమైనంతవరకు ఈ సినిమాను ఫిబ్రవరి 25వ తేదీని బీ టౌన్ లో కూడా విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇకపోతే ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో తెలుసుకోవడానికి చాలామంది ఉత్కంఠగా ఎదురు చూడడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: