రాశీ ఖన్నా అజయ్ దేవగన్ నటించిన రుద్ర ట్రైలర్ అదుర్స్..?

Divya
రుద్ర ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్ అనే వెబ్ సిరీస్ తో మొదటిసారిగా బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది రాశి ఖన్నా. హిందీలో స్టార్ హీరో అజయ్ దేవగన్ నటిస్తున్నాడు.. ఇక వీరిద్దరూ ఇన్ని రోజుల వెండి తెర మీద మాత్రమే అలరించారు ఇప్పుడు బుల్లితెర మీద కూడా అలరించబోతున్నారు.. ఇక ఈ వెబ్ సిరీస్ ను ఒక సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిచడం జరిగింది రాజేష్ మపున్కుర్. దీని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ కాబోతుంది.

ఈ సందర్భంగా చిత్ర మేకర్ స్ట్రీమింగ్ డేట్ అఫిషియల్ గా విడుదల చేస్తూ ట్రైలర్ని విడుదల చేయడం జరిగింది.. ఇందులో డీసీపీ ఆఫీసర్ గా రుద్ర వీర్ సింగ్ అనే ఒక పవర్ఫుల్ అధికారి పాత్రలో అజయ్ దేవగన్ నటించారు. తన కెరియర్ లోనే పవర్ ఫుల్ పోలీస్ పాత్రలు ఎన్నో పోషించాడు. ఇప్పుడు ప్రేక్షకుల్లో మునుపెన్నడూ చూడని విధంగా కనిపించబోతున్నట్లు గా సమాచారం. ఇక ఎలాంటి కేసు అయినా ఛేదించగల ఒక పోలీస్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించినట్లుగా ఈ ట్రైలర్ లో చూస్తే మనకు అర్థం అవుతోంది. ఇక తన భార్యతో విడిపోయి ఆలియాతో విచిత్రమైన స్నేహాన్ని ఏర్పరచుకున్న తరువాత ముంబై నగరాల్లో జరుగుతున్న కొన్ని వరుస హత్యలను ఛేదించే క్రమంలో కిల్లర్ ని పట్టుకొనే కథాంశంతో తెరకెక్కిచడం జరుగుతోంది.


ఇక ఈ వెబ్ సిరీస్ లో  కిల్లర్ ఎవరు..? ఈ హత్యల వెనుక ఎవరున్నారు అనే విషయం ఇక రుద్ర తన భార్య విడిపోవడానికి గల కారణం ఏమిటి ? అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక ఇందులో అజయ్ దేవగన్ భార్యగా ఇషా డియోల్  నటించింది. ఇక తెలుగు హీరోయిన్ రాసి ఖన్నా కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. ఇందులో రాశీ ఖన్నా లుక్స్ చాలా వెరైటీగా ఉన్నాయి అని చెప్పవచ్చు. సరికొత్త డిఫరెంట్ యాంగిల్ లో కనిపించింది రాశీ ఖన్నా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: