సీనియర్ స్టార్ హీరోయిన్ లలో ఒకరైన ఆమని అలనాటి స్టార్ హీరోల సినిమాలలో నటించి టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరిగా ఎంతో కాలం పాటు కొనసాగింది, ఆమని శుభలగ్నం, మిస్టర్ పెళ్ళాం, జంబ లకడి పంబ, శుభ సంకల్పం, ఘరానా బుల్లోడు వంటి అనేక సినిమాల్లో నటించింది, ఇలా ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఆమని కి శుభలగ్నం, శుభ సంకల్పం, మిస్టర్ పెళ్ళాం సినిమాలు గొప్ప గుర్తింపు ను తీసుకువచ్చాయి. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో గొప్ప పేరును సంపాదించుకున్న ఆమని కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు, ఆ తర్వాత చందమామ కథలు సినిమాతో ఆమని తిరిగి రీ ఎంట్రీ ఇచ్చింది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆమని వరుస సినిమాల్లో నటిస్తోంది, ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఆమని సీరియల్ లలో కూడా నటిస్తోంది, ఇలా సీరియల్ ల ద్వారా ఆమని బుల్లితెర అభిమానులను కూడా అలరిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఆమని అల్లంత దూరాన అనే మూవీ లో అతిధి పాత్రలో నటించింది, విశ్వ కార్తికేయ, హ్రితిక శ్రీనివాస్ ఈ సినిమాలో హీరో హీరోయిన్ లుగా నటించారు, ఈ మూవీ ని చలపతి పువ్వల దర్శకత్వంలో కోమలి సమర్పణలో ఎన్. చంద్రమోహనరెడ్డి నిర్మించారు, ఈ మూవీ ని తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ మూవీ త్వరలోనే విడుదల కాబోతోంది, ఈ నేపథ్యంలో ఆమని మాట్లాడుతూ... నా మేనకోడలు హ్రితిక పెద్ద డైలాగ్ ని కూడా ఒకే టేక్ లో చెప్పడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది, ఒక నటికి ఎన్ని రకాల పాత్రల్లో నటించిన కూడా సంతృప్తి రాదు. ఇంకా ఏదో చెయ్యాలి అని అనిపిస్తూ ఉంటుంది, మణిరత్నం, రాజమౌళి, సుకుమార్, పూరీ జగన్నాథ్ ల గారి మూవీస్ లో నటించాలని ఉంది అని తాజా ఇంటర్వ్యూ లో ఆమెని తెలియజేసింది.