ప్రాజెక్ట్ కె షూటింగ్ లో సందడి చేస్తున్న ప్రభాస్..!

Satvika
ప్రభాస్.. పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోంది. డార్లింగ్ చేస్తున్న సినిమాలు ఆ స్థాయిలో అతనికి పేరును తీసుకొచ్చాయి. అందుకే ప్రభాస్ తో సినిమాలు చేయడానికి చాలా మంది దర్షక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.. ఇప్పుడు డార్లింగ్ వరుస సినిమాల లో నటిస్తూ బిజిగా వున్నాడు.యంగ్ రెబెల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఈ పాన్ ఇండియా స్టార్ పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కిస్తున్న మరో చిత్రం ప్రాజెక్ట్ కె.. ఈ సినిమా గతంలో వచ్చిన సినిమాల తో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటుంది.



నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాను అన్నీ సినిమాల కన్నా ముందు ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటికి దీనికన్నా ముందు అన్నీ సినిమాలు ముందుగా షూటింగ్ పూర్తీ చేసుకున్నాయి.ప్రాజెక్ట్ కె కంటే తర్వాత సైన్ చేసిన సినిమాలే సెట్స్‌పైకి వెళ్లాయి. అందులో ఆదిపురుష్ అయితే షూటింగ్ కూడా పూర్తిచేసేసుకుని గ్రాఫిక్స్ పనులను పూర్తీ చేసుకొనే పనిలో బిజీగా వుంది.ఇటీవల ఈ సినిమా షూటింగ్ మొదలైంది. సినిమాను త్వరలోనే పూర్తీ చెయాలనె ఆలోచనలో చిత్ర యూనిట్ వుంది. 



కొన్ని రోజుల క్రితమే సినిమా రెగ్యులర్ షూట్ మొదలైంది. ప్రీ ప్రొడక్షన్ పనులను పక్కాగా ప్లాన్ చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్.. ఈ సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా వెనకడుగు వెయ్యమని నిర్మాత అన్నారు. సినిమా షూటింగ్ కు గ్రాఫిక్స్ చాలా అవసరమని అంటున్నారు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ చూడని విధంగా ఈ సినిమాలో ప్రభాస్ కనిపిస్తాడు అని నాగ్ అశ్విన్ అన్నారు. అన్నీ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు మిగితా షూటింగ్ ను పూర్తీ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాలో దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తుంది.. వచ్చే ఏడాది మే లో సినిమాను విడుదల చెస్తామని చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: