ట్రెండింగ్: ఆర్జీవి ట్విట్ల వర్షం కురిపించడానికి గల కారణం..?

Divya
 డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఏ పని చేసినా కూడా అది సంచలనం గానే మారుతుంది.. ఇక తను ఏం మాట్లాడినా కూడా అది వివాదమై చుట్టుముడుతూ ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ టిక్కెట్ల ధరల వ్యవహారంపై రాంగోపాల్ వర్మ ట్వీట్ చేసి సినిమా హీరో ల పై విరుచుకు పడడం జరిగింది. ఈ ట్వీట్ లతో ఆ హీరో అభిమానులు కాస్త ఆసహనంగా ఉన్నట్లు సమాచారం. అందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇక రెండు రోజుల క్రితం టాలీవుడ్ లో ఉండే సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ని కొంత మంది స్టార్ హీరోలు ,దర్శకులు ఇటీవల కలవడం జరిగింది.. ఇక ఇందులో ఆర్ నారాయణ మూర్త, మహేష్, చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్, కొరటాల శివ, వీరితో పాటు మరి కొంతమంది రావడం జరిగింది. అయితే వీరందరూ విన్నవించుకున్న విన్నపాలు విన్న జగన్మోహన్ మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇక ఈ నెల చివర్లో ఒక గుడ్ న్యూస్ తెలుపుతున్నారు అంటూ మీడియా అనంతరం అక్కడికి వెళ్ళిన టాలీవుడ్ చిత్ర బృందం తెలిపింది.. ఇక దీంతో ఈ అంశంపై వర్మ మరొకసారి ట్వీట్ల వర్షం కురిపించాడు.


ఏపీ సీఎం.. రియల్ మెగా సూపర్ డూపర్.. ఒక మెగాస్టార్ అని కూడా తెలియజేశారు. చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్.. ఒక మెగా స్టార్ అయిన జగన్ చుట్టూ.. J.R. ఆర్టిస్టుల కూర్చోవడం ఏమిటి అని ట్వీట్ చేశారు ఆర్జీవి.. ఇక మధ్యమధ్యలో మహేష్ చిరంజీవి ప్రభాస్ లు కేవలం పంచు డైలాగులు మాత్రమే ఉంటారని తెలియజేశాడు. కానీ రియల్ లైఫ్ ఫ్రేమ్ లో మాత్రం కేవలం జగన్ ఒక్కరే ఉన్నారని తెలియజేశాడు. ఏపీ సీఎం కు వారంతా భయపడ్డారని, బిక్ష కోసం జూనియర్ ఆర్టిస్టుల బెగ్గింగ్ చేస్తున్నారని ఎద్దేవా చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్లు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: