బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన హాట్ యాంకర్ రష్మీ?

VAMSI
తెలుగు యాంకర్ కమ్ నటి రష్మీ గౌతమ్ స్పీడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. ఒకప్పుడు అవకాశాలు కోసం ఈమె వెయిట్ చేసేది. అయితే ఇపుడు అవకాశాలే ఈమెను వెతుక్కుంటూ వస్తున్నాయి .  మూడు పదుల వయసు దాటుతున్నా ఇప్పటికీ అంతే గ్లామరస్ గా, హాట్ గా , పదహారనాళ్ళ  పడుచమ్మాయిలా కవ్విస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే రష్మికి ఒక బడా ఆఫర్ బాలీవుడ్ నుండి వచ్చినట్లు తెలుస్తోంది. ఓ బాలీవుడ్ యంగ్ హీరో సినిమా కోసం రష్మి సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ యంగ్ హీరో చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం రష్మిని  సంప్రదించగా ఆమె విన్న వెంటనే ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.

ఈమెకు తెలిసిన ఓ బాలీవుడ్ ఈవెంట్ మేనేజర్ ద్వారా ఈ అవకాశం దక్కినట్లు సమాచారం. ఇదే కనుక వర్క్ ఔట్ అయితే ఇక రష్మి సినిమా కెరీర్ పూర్తిగా మారబోతోంది. బాలీవుడ్ అందాల భామలకు ఏమాత్రం తగ్గని రష్మి ఈ ఆఫర్  ను సద్వినియోగ పరుచుకుంటుందని అంతా ఆశిస్తున్నారు. ప్రస్తుతం రష్మి ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోతో పాటుగా పలు టీవి షోలలో యాంకరింగ్ చేస్తున్నారు. అలాగే కొన్ని సినిమా అవకాశాలు కూడా ఈమె చేతిలో ఉన్నాయి. యాంకర్ గా, యాక్టర్ గా ప్రేక్షకులను అలరిస్తున్న రష్మి సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.

స్టేజ్ పై అలాగే సిల్వర్ స్క్రీన్ పై ఎంతో చలాకీగా , గ్లామరస్ గా కనిపించే ఈ హాట్ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువే. మరి బాలీవుడ్ నుండి వచ్చిన ఈ ఆఫర్ నిజమేనా? ఒకవేళ అయితే ఈ హీరో చిత్రంలో ఈ అమ్మడు ఐటెం సాంగ్ చేయనుంది అన్న పూర్తి వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: