గృహ ప్రవేశం చేసిన షన్ను.. ఎన్ని కోట్లు అంటే..?

Divya
సోషల్ మీడియా వేదిక అయినటువంటి యూట్యూబ్లో షణ్ముఖ్ జశ్వంత్ కి ఉన్నంత క్రేజ్ ఒక హీరోకి కూడా ఉండదని చెప్పవచ్చు. అంతేకాదు ఈయనకు దేశవ్యాప్తంగా  అభిమానులు ఉన్నారు అనడం లో ఎటువంటి సందేహం లేదు.. షణ్ముఖ్ జస్వంత్ నటించిన వీడియోలు యూట్యూబ్లో విడుదల అయితే చాలు కేవలం కొన్ని నిమిషాల్లోనే ట్రెండ్ సెట్ చేస్తూ మిలియన్  వ్యూస్ ను సొంతం చేసుకుంటూ ఉంటాయి.. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో విన్నర్ గా నిలుస్తారని అభిమానులంతా భావించినా.. కొన్ని అనుకోని కారణాలవల్ల రన్నర్ గా  నిలవాల్సి వచ్చింది.
ఇకపోతే ఈ షో ద్వారా ఈయనకు కళ్ళు చెదిరే స్థాయిలో పారితోషకం వచ్చినట్లు.. అంతేకాదు బిగ్ బాస్ విన్నర్ గెలిచిన మొత్తం కంటే ఎక్కువ మొత్తాన్ని షణ్ముఖ్ సొంతం చేసుకున్నట్లు కామెంట్లు వినిపించాయి.. ఇకపోతే షణ్ముఖ్ జస్వంత్ కు సినిమా అవకాశాలు కూడా వస్తూ ఉండగా.. వెబ్ సిరీస్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి ఇక పోతే ఈ రెండింటిలో ఏ మార్గాన్ని ఎంచుకోవాలి అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టమవుతోంది.. తాజాగా బిగ్ బాస్ ద్వారా సొంతం చేసుకున్న డబ్బుతో షణ్ముఖ్ కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. తాజాగా గృహప్రవేశం చేసి అందుకు సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో షేర్ చేసుకున్నాడు..
ఈ ఇంటికి సుమారుగా రెండు కోట్ల రూపాయలను వెచ్చించినట్లు సమాచారం.. ఇక తాజాగా షణ్ముఖ్ అభిమానులు అతనికి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు.. ఇక షణ్ముఖ్ గృహప్రవేశ వేడుకకు యూట్యూబర్ శ్రీవిద్య తో పాటు మరి కొంత మంది యూట్యూబ్ వాళ్లు హాజరైన విషయం తెలిసిందే.. ఇదిలా ఉండగా తన ప్రేయసి దీప్తి సునయన ను కొన్ని రోజుల క్రితం దూరం చేసుకున్న విషయం కూడా అందరికీ తెలిసింది .. కాకపోతే వీళ్లిద్దరు మళ్లీ కలవాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు కాబట్టి త్వరలోనే వీరిద్దరూ మళ్లీ కలిసే అవకాశాలు ఉన్నట్లు తాజా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: