ఆకట్టుకునే లిరిక్స్ తో F3 ఫస్ట్ సాంగ్ విడుదల..

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఇంకా యంగ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న సినిమా 'ఎఫ్ 3'. గతంలో వీళ్ళిద్దరూ  కూడా 'ఎఫ్ 2'లో నటించిన సంగతి తెలిసిందే.ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి పెద్ద హీరోనే ఇంప్రెస్ చేసిందంటే ఇక ఆ సినిమా రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అనిల్ రావీపూడి డైరెక్ట్ చేసిన ఆ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి 100 కోట్లకి పైగా వసూలు చేసింది.ఇక ఆ సినిమాకు ఇది సీక్వెల్ కాదు గానీ ఫ్రాంచైజీ అని అనొచ్చు. అందులో వున్న హీరోస్ క్యారెక్టరైజేషన్స్ ఇందులో కూడా కంటిన్యూ అవుతాయి. 'ఎఫ్ 2'లో కథంతా పెళ్ళాం, గాళ్ ఫ్రెండ్ ఇంకా హీరోల చుట్టూ తిరిగితే... 'ఎఫ్ 3'లో మాత్రం డబ్బు చుట్టూ తిరుగుతుంది. అందుకని, సినిమాలో డబ్బు మీద రూపొందించిన పాటను కూడా విడుదల చేశారు.


ఇక 'లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు... ఎవడు కనిపెట్టాడో గానీ దీన్ని అబ్బో!క్యాష్ లేని లైఫ్ కష్టాల బాత్ టబ్బో... పైసా ఉంటే లోకమంతా పెద్ద డాన్స్ క్లబ్బో' అంటూ సాగిన ఈ గీతానికి భాస్కరభట్ల మంచి సాహిత్యం అందించారు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో రామ్ మిరియాల ఆలపించారు.తమన్నా, మెహరీన్ కౌర్ ఇంకా అలాగే సోనాల్ చౌహన్ హీరోయిన్లుగా... రాజేంద్ర ప్రసాద్ ఇంకా సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాని శిరీష్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సినిమా విడుదలవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

f3

సంబంధిత వార్తలు: