క్రేజీ జోడి.. రామ్ చరణ్ సరసన రష్మిక?

praveen
ఇండస్ట్రీలో రాణించాలంటే ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అని చెబుతూ ఉంటారు సినీ పండితులు. ఇక ఇప్పుడు మనం చెప్పుకునే హీరోయిన్కు ఆవగింజంత కాదు గుమ్మడి కాయంత అదృష్టమే ఉంది అన్నది అర్ధమవుతుంది. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బ్లాక్బస్టర్ విజయాలను ఖాతాలో వేసుకుని దూసుకుపోతోంది. ఇప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా.. ఇంకెవరూ టాలీవుడ్ క్యూట్ బ్యూటీ రష్మిక మందన.

 చలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ గీత గోవింద సినిమా తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అంతలోనే మహేష్ బాబు సినిమాలో ఛాన్స్.. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్. దీంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది రష్మిక. తర్వాత చేసిన భీష్మ సినిమా కూడా బాగానే కలిసొచ్చింది.. ఇటీవల అల్లు అర్జున్ సరసన నటించిన పుష్ప సినిమా తో బ్లాక్ బస్టర్ విజయాన్ని మరోసారి ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ఇంకా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

 కాగా ప్రస్తుతం రష్మిక మందన మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది అన్నది అర్ధమవుతుంది. ఏకంగా రామ్ చరణ్ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. రాంచరణ్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమా  విడుదలకు  సిద్ధంగా ఉండగా.. ఆచార్య కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు చరణ్. ఇక ఆ తర్వాత జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తో సినిమాకు రెడీ అయిపోయాడు. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది సమ్మర్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా ఇక ఈ సినిమాలో రష్మిక మందన ఛాన్స్ కొట్టేసింది టాక్ వినిపిస్తోంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: