అల్లు అర్జున్ తో రొమాన్స్ కి రెడీ అంటున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్..!

Anilkumar
బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ "ఆర్ ఆర్ ఆర్" సినిమాలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా తరువాత ఈ బ్యూటీ టాలీవుడ్ లో కూడా అడుగు పెట్టబోతోంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కంటే ముందుగానే ఆలియాభట్ నటిస్తున్న హిందీ సినిమా "గంగుభాయ్ కథియవాడి" తెలుగులో కూడా విడుదల కాబోతోందట. అయితే ఆలియా భట్ మాత్రం ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది . అయితే ఈ ప్రమోషన్స్లో భాగంగా అలియా భట్ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొనడం జరిగింది.


అయితే అందులో ఆలియాభట్  మాట్లాడుతూ..' తాను ఈ మధ్యనే అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప" సినిమా చూసానని... అది తనకి చాలా బాగా నచ్చిందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తనతో పాటు తన కుటుంబ సభ్యులు అంతా కలిసి ఈ సినిమాని చూశారట చూడడమే కాకుండా చూసిన వారందరూ బన్నీ కి ఫ్యాన్స్ అయిపోయారు.అయితే నాకు ఎప్పుడు అల్లు అర్జున్ తో నటించే అవకాశం వస్తుంది అని అడుగుతున్నారు. ఇక ఆర్యభట్ట మీ ఇంట్లో అందరూ ఆలూ అని పిలుస్తారట.కాబట్టి ఆలు అల్లు తో ఎప్పుడు వర్క్ చేస్తావని ఇంట్లోవాళ్లు అందరూ నన్ను ఆటపట్టిస్తున్నారు. అయితే ఒక వేళ అల్లు అర్జున్ నటించే అవకాశం వస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటాను" అని చెప్పుకొచ్చింది ఆలియాభట్.


ఇక తాజాగా ఆలియాభట్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అంతేకాకుండా అలియా భట్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న నెక్స్ట్ సినిమా లో కూడా హీరోయిన్ గా కనిపించనుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఏవిధంగా ఇప్పటికే చాలామంది అనుకోగా చివరగా ఆలియాభట్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. మరి మరికొద్ది రోజుల్లో ని ఎన్టీఆర్తో నటించబోతున్న అలియా భట్ మన అల్లు అర్జున్ సరసన ఎప్పుడు కనిపిస్తుందో వేచిచూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: