మీటూ : పురుషులు మీరు కూడా ఓపెన్ అవ్వండి?
బాలీవుడ్లో కంగనా రనౌత్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మాటలు తూటాల్లా పేలస్తూ ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది. అచ్చంగా ఇలాగే తూటాలాంటి లాంటి మాటలతో పక్షులకు సుపరిచితురాలు గా మారిపోయింది నటి సౌందర్య రాశి దివ్యాంకా త్రిపాఠి. యే హై మొహబ్బతే లో నటించి నటిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో ఇటీవల ఈ హీరోయిన్ కూడా ఓపెన్ అయింది. నా నాశనం చేసేందుకు ఎంతోమంది ప్రయత్నాలు చేశారు అంటూ చెప్పుకొచ్చింది.
అదే సమయంలో సరికొత్త విషయం చెప్పి బాంబు పేల్చింది సౌందర్యరాశి దివ్యాంకా త్రిపాఠి లైంగిక వేధింపులు మహిళలకు మాత్రమే కాదు పురుషులకు కూడా తప్పడం లేదు అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇటీవల కాలంలో మహిళలు తెర మీదికి వచ్చి అన్ని నిజాలు చెబుతున్న సమయంలో ఇక ఇప్పుడు పురుషులు కూడా నోరు తెరవాల్సిన సమయం వచ్చింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను భయటకి వచ్చి మాట్లాడినప్పుడు నా భర్త భయపడతారు.. ఏం మాట్లాడుతానో అని.. నేను మాట్లాడకపోతే ఎవరూ వచ్చి మాట్లాడుతారు. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పోరాటం చేశాను. మీటూ తో ఎంతో మంచి జరిగింది. ఇప్పుడు ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించాలాంటేనే భయపడుతున్నారు అంటూ చెప్పుకొచ్చింది ఈ నటి.