ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ తాజాగా తను నటించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అయితే ఇప్పుడు బన్నీకి ఏకంగా ఐకాన్‌స్టార్ అన్న కొత్త బిరుదు కూడా వచ్చేసింది. బన్నీ తాజాగా వచ్చిన పుష్ప ఎలాంటి అంచనాలు లేకపోయినా కూడా బాలీవుడ్‌లో ఏకంగా రు. 100 కోట్ల వసూళ్లు సాధించిన సంగతి మనందరికీ తెలిసిందే.అయితే బన్నీకి ఇప్పటి వరకు తెలుగు తర్వాత మల్లూవుడ్‌లో ఆ రేంజ్‌లో మార్కెట్ ఉండేది. ఇప్పుడు అలాంటిది పుష్ప బాలీవుడ్లో రు. 100 కోట్లు కొల్లగొట్టడంతో ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా పనిలో బిజీగా ఉన్నాడు.ఇక బన్నీ నటించిన ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత బన్నీ డ్యాన్సులు చూసి యూత్‌కు పిచ్చెక్కిపోతోంది. అప్పట్లో రేసుగుర్రం, దేశముదురు, నాపేరు సూర్య సినిమాల్లో కూడా బన్నీ వేసిన స్టెప్పులు యూత్‌ను ఫిదా చేసేశాయి. ఇక అసలు విషయానికి వస్తే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ నటించిన ఓ సినిమాకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఇక ఈ సంగతి అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు.అయితే పవన్ కళ్యాణ్ హీరోగా బసవా వీరశంకర్ దర్శకత్వంలో గుడుంబా శంకర్ సినిమా వచ్చింది. అయితే ఈ సినిమాకు నాగబాబు నిర్మాత.
పవన్‌కు జోడీగా మీరాజాస్మిన్ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమాలో చిగురాకు చాటు చిలక అనే పాట చాలా మందికి ఇష్టం. అయితే ఈ పాట కి బన్నీ కొరియోగ్రాఫ్ చేశాడు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేష్‌కృష్ణ దర్శకత్వంలో వచ్చిన డాడీ సినిమా 2001లో రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాలో ఒక చిన్న డాన్స్ బిట్ ఉండడం జరుగుతుంది.ఇక ఈ బిట్‌లో అల్లు అర్జున్ కళ్లు చెదిరే స్టెప్పులు వేసి అందరికి ఆకట్టుకున్నాడు....అయితే ఆ తర్వాత 2003లో గంగోత్రి సినిమాతో హీరో అయ్యాడు బన్నీ.