మద్యపాన నిషేధంపై స్టార్ హీరో శంఖారావం... పక్కా హిట్?
ఇది నిజంగా విక్రమ్ ఫ్యాన్స్ కు పండుగ లాంటి వార్తే. అందుకే ఈ సినిమాపై అటు అభిమానులకు, ఇటు విక్రమ్ ఫ్యామిలీకి కూడా ఈ చిత్రం చాలా చాలా స్పెషల్ అయ్యింది. కాగా ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న వేళ ఇటీవలే ఈ మూవీ నుండి టీజర్ విడుదల కాగా ఆ టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. ఇక ఇపుడేమో ట్రైలర్ ను కాసేపటి క్రితమే చిత్రబృందం విడుదల చేసింది. ట్రైలర్ సాధాసీదాగానే ఉంది, మరి ఓ టి టి లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.
మరి ఈ సినిమా అయిన విక్రమ్ కు మంచి విజయాన్ని అందిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇందులో విక్రమ్ సరసన సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ నటిస్తుండగా, ప్రతినాయక పాత్రలో బాబీ సింహ నటిస్తున్నాడు. మరి డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కాబట్టి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ఒక సామజిక అంశంతో ముడిపడి ఉంది. ఒక టీచర్ ఏ విధంగా మద్యపానాన్ని నిషేధించడానికి పూనుకున్నాడు. ఆ తర్వాత అతనికి ఎదురైనా పరిణామాలు ఏమిటి అన్న విషయాలు తెలియాలంటే ఫిబ్రవరి 10 వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.