ఎన్టీఆర్, ప్రభాస్ లకు భారీ షాక్ ఇస్తున్న మహేష్ బాబు..!

Satvika
కరోనా మహమ్మరి విజ్రుంభిస్తున్న నేపథ్యంలో మూగబోయిన తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడు మళ్ళీ సినిమాల జోరును పెంచారు. ఇప్పుడు వరుస సినిమాలు షూటింగ్ ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మొత్తానికి రానున్న సమ్మర్ లో సినిమాల సందడి మొదలైంది..చిన్నా, పెద్ద సినిమాలు అన్నీ కూడా వన్ బై వన్ థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కాబోతున్నాయి.ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో జాతర జరగడం ఖాయంగా కనిపిస్తుంది.. సినీ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.


విషయాన్నికొస్తే.. మార్చి 11 న ప్రభాస్ రాదే శ్యామ్ సినిమా రిలీజ్‌ కానుంది. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. జనవరి 14న విడుదల కావాల్సిన రాదే శ్యామ్ కరోనా కారణంగా వాయిదా పడింది..400 కోట్ల బడ్జెట్ తో సినిమా రూపొందింది. పాన్ ఇండియా సినిమాగా విడుదల కానుంది.భారీ అంచనాలతో సిద్ధమైన ట్రిపుల్‌ ఆర్‌ కూడా రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా విడుదల చేస్తామని మొదటి సారి అనౌన్స్‌ చేసినప్పటి నుంచి వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తుంది.


గత ఏడాది 30 జులై న విడుదల చెస్తామని రాజమౌలి చెప్పినా కూడా పరిస్థితుల కారణంగా వెనక్కు వెళ్ళింది. మార్చి 18 లేదా ఏప్రిల్‌ 28న రిలీజ్‌ చేస్తామని ప్రకటించింది. ఆ తర్వాత మార్చి 25 న విడుదల చెస్తామని పేర్కొన్నారు. మే 12న ప్రిన్స్‌ నటించిన సర్కార్‌ వారి పాట రిలీజ్‌ కానుంది.. ఈ సినిమాకు కూడా ట్రిపుల్ ఆర్ కు వచ్చిన అడ్డంకులు వచ్చాయి. ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఒక వార్త చక్కర్లు కొడుతోంది.సర్కారు వారి పాట బుక్ మై షో యాప్‌లో 1 లక్ష ఆసక్తులను దాటింది, అయినప్పటికీ టీమ్ ఎప్పుడూ పూర్తి ప్రమోషన్‌లను ప్రారంభించలేదు. rrr 751K మరియు రాధే శ్యామ్ 163K కలిగి ఉంది. ఎటువంటి ప్రమోషన్ లేని ఈ సినిమాకు ఇంత క్రేజ్ రావడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.. మరి థియెటర్ల లోకి వచ్చిన తర్వాత ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: