విజయ్ దేవరకొండతో రష్మిక ఎఫైర్.. సాక్ష్యమిదేనట..?

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా విజయ్ దేవరకొండకి సంబంధించిన విషయం నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఆయన నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నతో ఇద్దరూ డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వినపడుతున్నాయి. వీరిద్దరూ కలిసి గీతగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలలో నటించారు. అయితే గీత గోవిందం సినిమాలో మంచి స్నేహితులుగా మారిన వీరిద్దరూ ఆ తర్వాత ప్రేమించుకున్నారు అని తర్వాత డేటింగ్ కూడా చేస్తున్నారు అని ప్రస్తుతం వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
అయితే  విజయ్ దేవరకొండ, రష్మిక మందన తమ తమ సినిమాల షూటింగుల్లో బిజీగా ఉన్నప్పటికీ సమయం కేటాయించుకుని మరీ లంచ్ కు అలాగే డిన్నర్ కు అటెండ్ అవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాక.. రష్మిక మందన్న ఎక్కువగా విజయ్ దేవరకొండ వారి ఇంట్లో జరిగే పార్టీలకు , ఫంక్షన్లకు హాజరవుతున్నట్టు మీడియాకి చిక్కారు. కాగా.. ఈ మధ్య కాలంలో రష్మిక మందన కొత్త సినిమా కోసం ముంబైకి షిఫ్ట్ అయిన విషయం అందరికి తెల్సిన విదితమే.
ఇక విజయ్ దేవరకొండ కూడా లైగర్ సినిమా షూటింగ్లో అక్కడే బిజీగా ఉన్నాడు.. అయితే వీరిద్దరూ కూడా తరచుగా అక్కడ పార్టీలకు , పబ్ లకు అటెండ్ అవుతున్నట్లు మీడియా కంటపడిన చిత్రాలు చూస్తే మనకు తెలుస్తుంది. అంతేకాక.. వీరిద్దరూ ప్రస్తుతం డేటింగ్ చేసుకుంటున్నారనే వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నప్పటికీ ఆధారాలు కూడా బలంగా ఉన్నాయని సమాచారం. ఇక వీరిద్దరు నిజంగానే డేటింగ్ లో ఉన్నారా లేక స్నేహితులుగా కలిసి తిరుగుతున్నారా అనే విషయం మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో రష్మిక వరుస సినిమాలతో దూసుకుపోతూ నేషనల్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక విజయ్ దేవరకొండ కూడా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే వీరిద్దరూ నిజంగానే డేటింగ్ చేస్తున్నారా అనే విషయం స్పష్టం చేస్తే తప్ప తెలియదనే చెప్పాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: