ప్చ్...ఆ హీరోయిన్ కు తప్పని హ్యాకింగ్ కష్టాలు... ?

VAMSI
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా కోలాహలం ఏ రేంజ్ లో పెరిగింది అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెలబ్రెటీల నుండి సామాన్యుల వరకు అందరూ సోషల్ మీడియాతో ఏదో ఒక రకంగా బిజీగా ఉండేవారే. ముఖ్యంగా హీరో, హీరోయిన్లు అయితే ఈ జోరు మరింత ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఇదే టైం లో హ్యాకర్లు కూడా తమ పనితనం బాగా చూపిస్తున్నారు. అదును దొరికితే చాలు సోషల్ మీడియా అకౌంట్ లను హ్యాక్ చేసేస్తున్నారు. ఇందులో సినీ యాక్టర్లు ఎక్కువగా ఉంటున్నారు. ఇపుడు తాజాగా మరో సినీ తార అకౌంట్ హ్యాక్ చేసి తామున్నామ్ అంటూ తమ ఉనికిని గుర్తు చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే యంగ్ హీరోయిన్ అమృత అయ్యర్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను హ్యాక్ చేశారు హ్యాకర్లు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ప్రకటించారు. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేయబడింది అని  సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు అమృత అయ్యర్. వీలైనంత త్వరలో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ తిరిగి యధా స్థితికి వస్తుందని ఆశిస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు ఈ యంగ్ హీరోయిన్. ఇప్పటి వరకు పలువురి సెలబ్రెటీల అకౌంట్లు హ్యాక్ అయిన సందర్భాలు చూశాం. అయితే ఆ తరవాత ఆ అకౌంట్స్ లలో అసభ్యకరమైన పోస్ట్లు పెడుతూ ఇబ్బంది పెడతారు.
కానీ అమృత ఇంస్టా అకౌంట్ నుండి అటువంటి మెసేజ్ లు ఏమీ పోస్ట్ కాక పోవడం ఒక్కటే సంతోషించాల్సిన విషయం. కాగా ఈమె నైటీనిచ్చిన మొదటి సినిమా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' పాటలతో హిట్ అయినా సినిమా మాత్రం నిరాశ పరిచింది. ఇంకా ఆ తర్వాత రెడ్, అర్జున ఫాల్గుణ సినిమాలు కూడా నిరాశ పరిచాయి. ప్రస్తుతమ తమిల్ లో ఒక మూవీ తెలుగులో హనుమాన్ అనే మూవీ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: