వాటికి నేను రెడీ అంటున్న రకుల్.. ఫాన్స్ హ్యాపీ?
ఇప్పుడు ఓటీటిలో వెబ్ సిరీస్ లు చేసేందుకు నేను కూడా సిద్ధంగా ఉన్నాను అంటూ చెబుతుంది హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ ఉండటం గమనార్హం. ఇక ఇటీవలే ఓ టి టి ప్లాట్ఫామ్స్ గురించి స్పందిస్తూ తన మనసులో మాట బయట పెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. ఆకట్టుకునేలా సాగే వినోదాత్మకమైన కథలకు వ్యూవర్స్ నుంచి ఎప్పుడు మంచి ఆదరణ ఉంటుంది. ఇక ఓటీటీ ప్లాట్ఫామ్స్ కారణంగా కథలకు మరింత ఆదరణ పెరిగిపోయింది అంటూ చెప్పుకొచ్చింది.
అయితే గత కొంత కాలం నుంచి ప్రాంతీయ సినిమాలు రిలీజ్ లు,ప్రేక్షకుల ఆదరణ కూడా పరిమితంగానే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఓటిటి కారణంగా ప్రాంతీయ సినిమాలకు కూడా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందే అవకాశం లభిస్తుంది. మంచి కథ ఓటిటీలోకి వచ్చిందంటే ఇక ప్రపంచవ్యాప్తంగా అందరూ దానిని ఆదరిస్తున్నారని చెప్పుకొచ్చింది. ఇక బాహుబలి సినిమా అన్ని కోణాల్లో కూడా కొత్త దారులను చూపించింది అంటూ చెప్పిన రకుల్.. ఈ సినిమా వల్ల భాషాపరమైన హద్దులు తొలగిపోయాయి అంటూ చెప్పుకొచ్చింది. ఓటిటిలో షో లేదా వెబ్ సిరీస్ చేయడానికి నేను రెడీ గా ఉన్నా.. స్టోరీ నన్ను ఎగ్జైట్ చేయడమే కాదు నా పాత్ర కథను నడిపించే విధంగా ఉంటే ఓకే చెబుతాను అంటూ రకుల్ తెలిపింది..