ఇప్పుడు స్టార్ హీరోల సినిమా వరుసగా కనిపిస్తున్నాయి. కోవిడ్ పరిస్థితులు చక్కబడిన తర్వాత సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు వరుస సినిమలతో ఫుల్ బిజీ అయిపోయింది. స్టార్ హీరోలు కూడా సినిమాలను తక్కువ సమయం లోనే పూర్తీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.ఇక అభిమానులు కూడా అంతే వాళ్ళ అభిమాన హీరో సినిమా వస్తుంది అంటే హంగామా కూడా మాములుగా ఉండదు.కటౌట్స్, ఫ్లెక్సీలు, పాలాభిషేకాలు, పుట్టినరోజులప్పుడు భారీ కేక్ కటింగ్స్, అన్నదానాలు, రక్తదానాలు మామూలు ఇలా ఎన్నో చేస్తారు.
సినిమాలలొ వాళ్ళు వేసుకొనే డ్రెస్సుల నుంచి హెయిర్ స్టయిల్ వరకూ వారికి నచ్చితే ఫాలో అవ్వడం పక్కా..ఇటీవల టాటూల ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు పాత పద్ధతిని మళ్లీ గుర్తుచేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఒకప్పుడు మార్కెట్లో సౌందర్య చీర, చిరంజీవి చొక్కా అని సేల్ చేసేవారు. వాళ్ళు వేసుకున్న ఆ డ్రెస్సులను వేసుకోవడం వల్ల ఆ కిక్కే వేరు అని చెప్పాలి. ఇది ఇలా ఉండగా ఇప్పుడు మహేష్ బాబు లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట' లో వేసుకున్న టీ షర్ట్స్ ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి. అలాగే 'సరిలేరు నీకెవ్వరు' లో 'మైండ్ బ్లాక్' సాంగ్‌లో వేసుకున్న టీ షర్ట్ కూడా ఉన్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్రాండ్ జీన్స్ ప్యాంటులు కూడా ఆన్‌లైన్‌లో దొరికేస్తున్నాయి. రెండు పాకెట్స్ మీద ఎన్టీఆర్ ఫొటోతో పాటు నేమ్ లోగోతో కూడిన జీన్స్ వచ్చేసాయి.. మహేష్ బాబు వేసుకున్న చొక్కాలు.. ఇలాంటి ప్రమోషన్ చాలా బాగుంది. వీటికి ఆన్ లైన్ లో డిమాండ్ కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. వీరి సినిమాల విషయాన్నికొస్తే.. మహేష్ బాబు సర్కార్ వారి పాట చెస్తున్నారు.. ఆ సినిమా అవ్వగానే త్రివిక్రమ్ తో సినిమా చెస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమా చేస్తున్నారు. అది అయ్యాక కోరటాల శివ తో మరో సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది.