వామ్మో: ప్రభాస్ మకాం మారుస్తున్నాడా.. ఆ ఇంటికి అన్ని కోట్లా..??

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్ ప్రభాస్ తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీలో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న వారిలో ప్రభాస్ ఒక్కరు. ఇక దర్శకధీరుడు ప్రభాస్ తెరకెక్కించిన బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు, గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ తరుణంలోనే  కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ వరుస పాన్ ఇండియా సినిమాలను చిత్రీకరిస్తున్నారు.

అయితే ప్రస్తుతం ప్రభాస్ సలార్, రాధే శ్యామ్ వంటి సినిమాలలో నటిస్తున్న ఆయన ఏకంగా రూ. 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇక తాజాగా అందిన సమాచార మేరకు.. ప్రభాస్ ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి అయిపోతే త్వరలోనే ఆ దేశానికి పూర్తి గా మకాం మార్చబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా.. ఆ దేశంలో ఏకంగా సొంత ఇంటిని నిర్మించుకుంటున్నాడు అని.. ఆ ఇంటి కోసం ఏకంగా కొన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాడు వార్తలు వినపడుతున్నాయి.

ఇక వివరాల్లోకి వెళితే.. ఫారిన్ టూర్స్, ఓవర్సీస్ షూటింగ్ షెడ్యూల్స్ కి ప్రభాస్ నో చెప్పే రోజులు పోయాయని సమాచారం. అందుకు కారణం ఏంటంటే.. అప్పట్లో ప్రభాస్ హైదరాబాద్‌తో పాటు భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో షూటింగ్‌కి ప్రాధాన్యత ఇచ్చేవాడని, విదేశాలకు వెళ్లేందుకు ఎప్పుడూ ఆసక్తి చూపలేదని సమాచారం. కానీ ఇప్పుడు ఆయన సినిమాల్లో చాలా వరకు విదేశాల్లో కనీసం రెండు పాటల షూటింగ్ అయినా జరుగుతోందని సమాచారం. అయితే కేవలం షూటింగ్స్ పరంగానే కాకుండా ప్రభాస్ ఇటీవల కాలంలో విదేశాల్లోనే ఎక్కువగా రెస్ట్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అందులో ప్రభాస్ యూరప్ ని ఎక్కువగా సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు.. యూరప్ కంట్రీస్ లోని ఒక ప్రశాంతమైన బీచ్‌కు సమీపంలో ఉన్న పాతకాలపు విల్లాను కొనుగోలు చేయాలని చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరో విషయం ఏంటంటే.. . ఇంతవరకు భారతదేశంలో ఏ నటుడు కూడా అలాంటి ఖరీదైన విల్లాను కొనుగోలు చేయలేదని.. దాని విలువ దాదాపు 300కోట్లకు పైగానే ఉంటున్నట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: