ఆ స్టార్ హీరోయిన్ ని పక్కన పెడుతున్న నిర్మాతలు..కారణం..?

Divya
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ అయినా సరే దర్శకనిర్మాతల విషయంలో చాలా ఆచితూచి అడుగు వేయాలి అనే విషయం ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్ ల ద్వారా మనకు తెలిసిందే.. ఇప్పుడు మరొక హీరోయిన్ కూడా మొండిఘటం లా బిహేవ్ చేస్తోందట . ఆమె క్రేజ్ రోజురోజుకు పెరిగి పోతుండటంతో బింకం మాత్రం వదలడం లేదని సినీ ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆమె ఎవరో కాదు బుట్ట బొమ్మ గా గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే విషయంలోని ఈ వార్తలన్నీ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈమె క్రేజ్ మాములుగా లేదు అని చెప్పవచ్చు..
ప్రభాస్ సరసన పాన్ ఇండియా సినిమాలో రాధేశ్యాం లో నటించిన విషయం తెలిసిందే . అయితే ఈ సినిమా జనవరి 14వ తేదీన విడుదల కావలసి ఉండగా కరోనా కారణంగా మార్చి మొదటి వారానికి విడుదల వాయిదా వేశారు. ఇక ఆచార్య సినిమా కూడా ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల కావాల్సి ఉండగా ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. తమిళంలో ఈమె నటించిన బీస్ట్ సినిమా కూడా ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
అఖిల్ సరసన నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం విడుదలై మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. హిందీ లో ఈమె నటించిన సర్కార్ సినిమా కూడా త్వరలోనే విడుదల కాబోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలన్నింటిలో కూడా తన పనిని తాను షూటింగ్ రూపంలో పూర్తి చేసుకుని పూజా హెగ్డే ప్రస్తుతం ఖాళీగా ఉన్నట్లు సమాచారం.. అంతేకాదు ఈ సినిమాల విడుదల కోసం ఎదురు చూస్తూ ఉంది.. కానీ షూటింగ్ చేయడానికి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఈమె చేతిలో లేకపోవడం సంచలనంగా మారింది అని చెప్పాలి..
కారణం ఏమిటంటే ఈమె క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలు పారితోషికం కింద ఒక్కో  సినిమాకు డిమాండ్ చేస్తోందని సమాచారం.. చిన్న సినిమాల నిర్మాతలు ఈమె చేసే డిమాండ్ను తట్టుకోలేక ఈమె దరిదాపుల్లో కూడా వెళ్లడం లేదు.. కేవలం నటించాలి అంటే స్టార్ హీరోల ఉండాలి లేదా అత్యధిక బడ్జెట్ తో వచ్చే సినిమా అయినా అయి ఉండాలి. అందుకే చిన్న నిర్మాతలు అందరూ ఈమెను దూరం పెడుతున్నారు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: