బాలయ్య షోకి ఎన్టీఆర్ రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

N.ANJI
ప్రస్తుతం బాలయ్య షో అన్ స్టాపబుల్ షో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ట్రేండింగ్ లో నిలుస్తుంది. అయితే ఆహలో ఆహా అనిపించే విధంగా అన్ స్టాపబుల్ షో రాణిస్తుంది. అంతేకాదు.. ఈ షోలో హోస్ట్ బాలయ్య కూడా తనదైన శైలిలో రాణిస్తున్నారు. అయన టైమింగ్ తో హోస్టుగా ఒక సూపర్ సక్సెస్ చేశాడని చెప్పడంలో ఎలాంటి అతిశయాక్తి లేదు. ఇక ఈ షోకి సంబంధించి త్వరలోనే ముగింపు చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలోనే అన్ స్టాపబుల్ కి మిగతా గెస్టులు ఎందుకు రాలేదని ఫ్యాన్స్ ఆరాలు తీస్తున్నారు.
అయితే అందులో  ముఖ్యంగా ఎంతో మంది హీరోలు రాకపోయినప్పటికీ.. ముందుగా బాబాయ్ హోస్ట్ చేస్తున్న షో కి అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు గెస్ట్ గా రాలేదని నందమూరి అభిమానులలో సందేహం తలెత్తింది. ఇక ఈ విషయంపై మాత్రం చాలానే గాసిప్స్ బాగానే వినిపిస్తున్నాయి. అంతేకాదు..  అన్ స్టాపబుల్ షో రైటర్ B.V.S. రవి తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అదేంటంటే.. అన్ స్టాపబుల్ షో లో కేవలం కొంతమంది వ్యక్తులను మాత్రమే మేము ముందుగా ప్లాన్ ప్రకారం చేసుకున్నామని.. మిగతా కొంతమంది వారి డేట్స్ అనుకూలంగా లేకపోవడంతో వారిని ప్రదర్శించ లేక పోయామని పేర్కొన్నాడు.
అంతేకాదు.. ముఖ్యంగా చిరంజీవి, వెంకటేష్, ప్రభాస్ వంటి హీరోలు డేట్స్ అడ్జస్ట్ కాక రాలేకపోయారని చెప్పుకొచ్చాడు. కాగా.. ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కారణం వేరని.. ఆ సమయంలో రామ్ చరణ్, తారక్ నటిస్తున్న rrr సినిమా ప్రమోషన్ లో చాలా బిజీగా ఉన్నారని పేర్కొన్నాడు. ఈ షో యూనిట్ వారిని కలిసే లోపే రాజమౌళితో వారు ముంబైలో ఉన్నారని రవి చెప్పుకొచ్చారు. ఇక బాలయ్య మీద ఉన్న గౌరవం కారణంగానే.. ఆ టీమ్ నుండి రాజమౌళి,కీరవాణి గారు రావడం జరిగిందని పేర్కొన్నారు. అయితే కేవలం rrr ప్రమోషన్ లో కారణంగానే ఎన్టీఆర్ రాలేకపోయారని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: