పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్, ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే ను అందిస్తున్నాడు, ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిత్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా, దగ్గుబాటి రాణా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది, భీమ్లా నాయక్ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనున్ కొషియన్ సినిమాకు తెలుగు రిమేక్ గా తెరకెక్కుతుంది, ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి, ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగిఉన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది.
అయితే ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల ఈ సినిమాను సంక్రాంతి బరి నుండి తప్పించి ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది, అయితే ఈ సినిమాను ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన తర్వాత దేశంలో కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతుండటంతో భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25 వ తేదీన కూడా వాయిదా పడే అవకాశం ఉంది అంటూ అనేక వార్తలు వచ్చాయి, అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను ఫిబ్రవరి 25 వ తేదనే విడుదల చేసే ఉద్దేశంలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే భీమ్లా నాయక్ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చాడు, తమన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కుతుంది.