సమంత రిజెక్ట్ చేసిన 5 సినిమాలు.. ఐదూ ఫ్లాపే..!
బ్రూస్ లీ: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే `బ్రూస్ లీ`. ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంతను తీసుకోవాలని మేకర్స్ ఆమెను సంప్రదించారట. కానీ, ఆమె నో చెప్పడంతో.. ఆమె స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్ వచ్చింది. అయితే భారీ అంచనాల నడుమ 2015 అక్టోబరు 16న విడుదలైన ఈ మూవీ బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది.
నిన్ను కోరి: న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన `నిన్ను కోరి` చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నటించే అవకాశం సమంతకు రాగా.. ఆమె ఈ మూవీని రిజెక్ట్ చేసింది. దాంతో ఆమె బదులుగా నివేదా థామస్ ను తీసుకున్నారు. అయితే 2017లో రిలీజ్ అయిన ఈ మూవీ కూడా ఫ్లాపైంది.
ఎవడు: రామ్ చరణ్, అల్లు అర్జున్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం `ఎవడు`. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం సామ్‌ను అడగగా.. ఆమె తిరస్కరించింది. ఇక ఈ చిత్రం సైతం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
ఐ: ఎస్.శంకర్ దర్శకత్వంలో విక్రమ్, ఎమీ జాక్సన్ జంటగా నటించిన చిత్రం `ఐ`. ఇందులో హీరోయిన్‌గా నటించాలని సమంతను కోరినా.. నో చెప్పింది. ఇక భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది.
ఎన్టీఆర్ కథానాయకుడు: నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న `ఎన్టీఆర్ కథానాయకుడు`లో ఓ హీరోయిన్ పాత్ర కోసం సామ్‌ను అడిగారట. అయితే పలు కారణాల వల్ల ఆమె రిజెక్ట్ చేసింది. కట్ చేస్తే ఈ సినిమా సైతం ఫ్లాపే అయింది.