ప్రియుడితో బ్రేకప్ : సల్మాన్ మరదలు సీరియస్ ?

Purushottham Vinay
బాలీవుడ్ యువ నటుడు అర్జున్ కపూర్ ఇంకా బాలీవుడ్ ఐటమ్ గర్ల్ సల్మాన్ ఖాన్ తమ్ముడి భార్య మలైకా అరోరా చాలా కాలంగా డేటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ అనేక రకాల వార్తలు వచ్చాయి.అయితే వయసురీత్యా వీరిద్దరి మధ్య కూడా ఏకంగా 12 ఏళ్ల గ్యాప్ అనేది ఉంది. అర్జున్ కపూర్ కంటే మలైకా పన్నెండేళ్లు పెద్దది. దీంతో వీరి రిలేషన్ ఇప్పుడు బాలీవుడ్ లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.ఇక ఎప్పటికప్పుడు వీరిద్దరూ కలిసి తీసుకున్న ఫొటోలు ఇంకా వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి.ఇక ఇదిలా ఉండగా.. కొన్ని రోజులు నుంచి అర్జున్ కపూర్, మలైకా అరోరా విడిపోతున్నట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తమ నాలుగేళ్ల ప్రేమ బంధానికి వీరు బ్రేకప్ చెబుతున్నట్లు బాలీవుడ్ లో ప్రచారం అనేది బాగా జరుగుతోంది.

ఇక ఇప్పటికే వీటిపై హీరో అర్జున్ కపూర్ స్పందించిన విషయం తెలిసిందే. మలైకాతో దిగిన ఓ హాట్ ఫొటోను షేర్ చేస్తూ తాము విడిపోతున్నట్లు వస్తోన్న రూమర్లకు చెక్ పెట్టాడు. తాజాగా మలైకా అరోరా కూడా తమ రిలేషన్షిప్ పై స్పందించడం జరిగింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఈ ఐటమ్ బ్యూటీ ఓ సీరియస్ పోస్ట్ పెట్టింది.'40 సంవత్సరాల వయసులో ప్రేమలో పడటం సాధారణం విషయంగా భావించండి.. మీ 30 సంవత్సరాల వయసులో కొత్త కలలను కని సాధించడానికి ప్రయత్నించొచ్చు.. మీ 50 సంవత్సరాల వయసులో మిమ్మల్ని, మీ లక్ష్యాన్ని మీరు సాధించుకోవచ్చు. 25 సంవత్సరాలతో జీవితం ముగిసిపోదు. ఇక అలా ఆలోచించడం మానేద్దాం' అంటూ సీరియస్ గా రాసుకొచ్చింది ఈ ఐటమ్ బ్యూటీ. ఈ పోస్ట్ తో అర్జున్ కపూర్ ఇంకా అలాగే మలైకా అరోరాల మధ్య వయసు గురించి ప్రశ్నిస్తున్న వారందరికీ గట్టిగా సమాధానమిచ్చినట్లైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: