సొంత పేర్లతో ఆ పని చేసి నిండా మునిగిన హీరోలు..అసలేం జరిగిందంటే?
నాగార్జున: టాలీవుడ్ కింగ్ నాగార్జున తన పేరుతో `కెప్టెన్ నాగార్జున` అనే చిత్రం చేశాడు. వి.బి.రాజేంద్రప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కుష్బూ హీరోయిన్గా నటించింది. జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై వి.బి.రాజేంద్రప్రసాద్ స్వయంగా నిర్మించారు. కానీ, 1986లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
చిరంజీవి: మెగాస్టార్ చిరంజీవి తన పేరుతో రెండు సినిమాలు చేశారు. 1985లో `చిరంజీవి` టైటిల్‌తో ఓ సినిమా చేశారు. కన్నడ సినిమా నేనే రాజాకు రీమేక్ గా రూపుదిద్దుకున్న ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. ఆ తర్వాత కె. విజయభాస్కర్ దర్శకత్వంలో `జై చిరంజీవ` టైటిల్‌తో మరో చిత్రం చేయగా.. ఇదీ అంచనాలను అందుకోలేకపోయింది.
అఖిల్ అక్కినేని: నాగార్జున తనయుడైన అఖిల్.. తన తొలి చిత్రాన్నే తన పేరుతో తీశాడు. వి.వి. వినాయక్ దర్శకత్వంలో హీరో నితిన్ నిర్మాణంలో రూపుదిద్దుకున్న `అఖిల్` సినిమా 2015లో విడుదలై భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో నిర్మాత నితిన్‌కి భారీ నష్టాలు మిగిలాయి.
రామ్ చరణ్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పేరు కలిసి వచ్చేలాగా చేసిన చిత్రం `వినయ విధేయ రామ`. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల నడుమ 2019లో రిలీజైన ఈ మూవీ కూడా ఫ్లాపే అయింది.
ఇక విక్టరీ వెంకటేష్ తన సొంత పేరు టైటిల్‌గా చేసిన సినిమా వెంకీ మామ, నాగ చైతన్య చేసిన దోచెయ్, ఎన్టీఆర్ చేసిన రామయ్యా వస్తావయ్యా చిత్రాలు కూడా ప్రేక్షకులను నిరాశ పరిచాయి.