అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరం లేదేమో!!
వాటిలో క్రేజీ ఫిలిం గా ఉంది సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై కూడా ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు ఏర్పరుచుకున్నారు. శృతి హాసన్ కథానాయిక గా నటిస్తున్న ఈ సినిమా కేజిఎఫ్ లెవెల్లో తెరకెక్కుతుంది అంటున్నారు. ఇక బాలీవుడ్ లో ప్రభాస్ చేస్తున్న సినిమా ఆది పురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మైథలాజికల్ సినిమా గా తెరకెక్కుతు ఉండగా ఈ సినిమా ను భారీ బడ్జెట్ తో వాఋ తెరకెక్కిస్తు ఉండడం విశేషం.
ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఇంకా మొదలుపెట్టనే లేదు అప్పుడే గొప్పలు చెప్పడం మంచిది కాదని వార్నింగ్ ఇస్తున్నారు. ఈ సినిమా నిర్మాత ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ చిత్రం విడుదల అయిన తరువాత ప్రభాస్ రేంజ్ హాలీవుడ్ కి రేంజ్ లో ఉంటుందని అన్నారు. దాంతో అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరం లేదు అంటున్నారు విమర్శకులు. తొందరలోనే ఈ సినిమా షూటింగ్ లో ప్రభాస్ జాయిన్ కానున్నాడు. ఇకపోతే సందీప్ వంగ దర్శకత్వంలో కూడా ప్రభాస్ స్పిరిట్ అనే సినిమా చేయనున్నాడు. మరి ప్రభాస్ ఈ సినిమా తర్వాత ఏ స్థాయి లో ఇమేజ్ అందుకుంటాడో చూడాలి.