బాబోయ్: షణ్ముఖ్‌తో కలవాంటే.. దీప్తి సునైనా పెడుతున్న కండీషన్లు..!?
బిగ్‌బాస్ షో ఫైనలిస్ట్, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్‌లో ఫీల్ గుడ్, ఎంటర్టైన్మెంట్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందారు. ఊహించని రీతిలో మంచి క్రేజ్‌ను, ఫ్యాన్ ఫాలొయింగ్‌ను సంపాదించుకున్నారు. షణ్ముఖ్ – దీప్తి సునైనా ప్రేమ వ్యవహారం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇద్దరూ కలిసి షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్ చేశారు కూడా. ఇద్దరూ రిలేషన్లో ఉన్నా.. బిగ్‌బాస్ షోలో ఎంట్రీ ఇచ్చిన షణ్ముఖ్.. అక్కడ సిరితో క్లోజ్‌గా మూవ్ అయ్యారు. సిరి కూడా అప్పటికే శ్రీహాన్‌తో రిలేషన్లో ఉన్నారు. అయినా వారిద్దరూ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ బాగా క్లోజ్ అయ్యారు. ఈ ఎఫెక్ట్ వీరి ప్రేమ వ్యవహారం.. బ్రేకప్‌కు దారి తీసింది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో షణ్ముఖ్- దీప్తి సునైనా బ్రేకప్ వ్యవహారాన్ని బాగానే ఎక్స్ పోస్ చేస్తున్నారు.
మనం ఎలా బతుకుతున్నామని ఎవరికీ ఒక ఆలోచన ఉండదు. కానీ వేరే వాళ్ల జీవితాల్లో తొంగి చూసే నేచర్ మనుషులకు సొంతం. మన వీపు మనకు కనపడదు కానీ, ఎదుటోడి వీపుపై ఉన్న మచ్చలపై, క్యారెక్టర్‌పై ఆరోపిస్తూ ఉంటాం. అలా సోషల్ మీడియాలో ఈ జంటపై పెద్ద రచ్చనే నడుస్తోంది. వీరిద్దరు కలుసుకోవాలని కొందరు అంటుంటే.. మరికొందరు.. షణ్ముఖ్ ఇలా చేయకపోతే బాగుండేది.. దీప్తి గేమ్‌లా చూస్తే బాగుండేదని సలహాలు ఇస్తున్నారు. అలా ఈ ఇద్దరికీ పెద్ద టాస్క్ లా మారింది. తాజాగా షణ్ముఖ్ దీప్తి సునైనాను కలవడానికి కండిషన్లు పెట్టినట్లు వస్తున్న వార్తలు దుమారం రేపుతున్నాయి. ఇలాంటి గాసిప్స్ వింటే ఎవరికైనా చిరాకు పుట్టుకొస్తుంది.
వాస్తవానికి దీప్తి సునైనా షణ్ముఖ్ బ్రేకప్ తర్వాత ఎవరి లైఫ్ వాళ్లు హ్యాపీగా బతుకుతున్నారు. కానీ నెటిజన్లకు వాళ్లు ప్రశాంతంగా బతకడం నచ్చదనుకుంటా.. అందుకే నోటికి వచ్చినట్లు రాసేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తుంటారు. ఎలాగైనా ఈ జంట కలవాలని అభిమానులు, స్నేహితులు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కలిస్తే ఈ జంటను మళ్లీ చూడొచ్చు. అయితే ఇకపై ఇలాంటి రాతలు రాయడం తగ్గించుకోవాలని, త్వరలో ఈ విషయంపై దీప్తి సునైనా క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఒకవేళ దీప్తి.. షణ్ముఖ్‌ను కలిస్తే ఎలాంటి కండీషన్లు పెట్టనుంది. కలిసి ఉంటారా.. లేదా తెలుసుకోవాలంటే.. ఇంకొన్ని రోజులు వేచి చూడాలి.