‘హనుమాన్ జంక్షన్’ సినిమాకు ముందుగా ఆ స్టార్ హీరోలనే అనుకున్నారంట..!
‘హనుమాన్ జంక్షన్’ సినిమా మీకు గుర్తుకు ఉండే ఉంటుంది. స్టార్ హీరోలు అర్జున్, జగపతిబాబు హీరోలుగా నటించిన ఈ సినిమా అప్పట్లో బాగా హిట్ అందుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న మోహన్ రాజ్.. హనుమాన్ జంక్షన్ సినిమాపై పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ మోహన్ రాజ్ 20 ఏళ్ల కిందట వచ్చిన ఈ సినిమాపై పలు అంశాలు వెల్లడించారు.
మోహన్ రాజ్ ప్రముఖ సీనియర్ నిర్మాత కొడుకు. ఇతనికి మొదట్లో ‘నువ్వే కావాలి’ సినిమాకు రీమేక్ అవకాశం వచ్చినా దాన్ని కాదని.. మలయాళం సూపర్ హిట్ మూవీ ‘థెన్ కాశి పట్టణం’ సినిమాను డైరెక్ట్ చేయడానికి ఎంచుకున్నాడు. కాగా, ‘హనుమాన్ జంక్షన్’ సినిమాను స్టార్ హీరోలు ‘జగపతి బాబు, వేణు, అర్జున్’ నటించారు. ఈ ఫ్యామిలీ ఓరియంట్ మూవీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఫ్రెండ్షిప్, లవ్, కామెడీ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించిన ఈ చిత్రం మంచి హిట్ అందుకుంది. అయితే ఈ సినిమాలో హీరోగా మొదట్లో అర్జున్, జగపతి బాబు అనుకోలేదట. ఈ రీమేక్ సినిమా కోసం దర్శకుడు మోహన్ రాజ్.. మోహన్ బాబు, రాజా, రాజశేఖర్ హీరోలను అనుకున్నారంట. అర్జున్ స్థానంలో రాజశేఖర్, జగపతిబాబు ప్లేస్‌లో మోహన్ బాబు. ఈ హీరోలను ఓకే చేయడంతోపాటు.. వారికి అడ్వాన్స్ కూడా చెల్లించినట్లు సమాచారం.
అయితే మోహన్ రాజ్ కొత్త దర్శకుడు కావడంతో.. రాజశేఖర్, మోహన్ బాబు స్టైల్‌కు తగ్గట్లు సినిమా పూర్తి చేయగలుగుతాననే నమ్మకం లేదన్నారు. ఆ సమయంలో ఎడిటర్ మోహన్.. రాజా ఈ సినిమా స్టోరీపై ఫోకస్ చేస్తున్నారా..? లేదా వాళ్ల వర్కింగ్ స్టైల్ గురించి ఆలోచిస్తున్నాడా..? అని భయపడ్డారంట. దీంతో వారి స్థానంలో జగపతిబాబు, అర్జున్‌ని అనుకున్నారంట. రాజశేఖర్, మోహన్ బాబు షూటింగ్ స్పాట్‌కు టైంకి వచ్చేస్తారు. వాళ్లు వచ్చే టైంకి మిగిలిన ఆర్టిస్టులు రాకపోతే దర్శకుడిపై పని భార పడుతుంది. అలాంటి పరిస్థితులో సినిమాను ఓవర్ టేక్ చేయడం కష్టంగా మారుతుందని ఎడిటర్ మోహన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.