గత ఏడాది సినిమా ల పై ప్రభావాన్ని చూపించిన కరోనా మహమ్మరి.. ఇప్పుడు కూడా పంజా విసురుతున్న సంగతి అందరికి తెలిసిందే.. అయితే ఈ ఏడాది సంక్రాంతి కి చాలా సినిమాలు విడుదల కావాల్సి ఉన్నాయి. కరోనా ఒకవైపు కొత్త వేరియంట్ ఓమిక్రాన్ మరో వైపు వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యం లో ఇప్పుడు వస్తున్న సినిమాలు అన్నీ వాయిదా పడిన సంగతి తెలిసిందే.. సినిమా షూటింగ్ లు కూడా వాయిదా పడినట్లు తెలుస్తుంది. మళ్ళీ సినీ ఇండస్ట్రీ నష్టాల ను ఎదుర్క్కొవాల్సి వస్తుంది.ఇప్పటికే చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు.
ఇది ఇలా ఉండగా.. డబ్బులు లేక పవన్ కళ్యాణ్ సినిమా ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు చిత్రం సైతం ఫైనాన్స్ ప్రోబ్లెం తో ఆగిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ సినిమా కు డబ్బులు ఇవ్వని వారు ఎవరు ఉంటారని అనుకోవచ్చు. కానీ డబ్బులు తీసుకోకకాదు.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యం లో ఆలా ఫైనాన్స్ తీసుకొని సినిమా చేయడం ఇష్టం లేక ఆపేశారని సినీ వర్గాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతుంది..
పవన్ తన రాజకీయా కార్యక్రమాల తో బిజీగా ఉండటం వల్ల 'హరి హర వీర మల్లు'కి సమయాన్ని కేటాయించలేదు. తదుపరి షెడ్యూల్ పై ఇంకా క్లారిటీ లేదట. ఇలాంటి సమయం లో ఫైనాన్సియర్స్ దగ్గర నుంచి డబ్బులు తెస్తే వారికి వడ్డీలు కట్టాల్సి ఉంటుంది. పని ముందుకు జరగకుండా వడ్డీలు కట్టడం ఎందుకనేది మేకర్స్ ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం కరొన పరిస్థితులు పెరుగుతూన్నాయని అందరికి తెలిసిందే. జనం కూడా భయాందోళన కు గురవుతున్నారు.. ఈ పరిస్థితులు ఎప్పుడూ చక్కబడతాయి. ఎప్పుడూ సినిమా సెట్స్ మీదకు వెళుతూంది అనేది తెలియాల్సి ఉంది.. పవన్ ఇప్పుడు మరో రెండు సినిమాల లొ నటిస్తూ బిజిగా ఉన్నారు.