మాస్ రాజాతో ముగ్గురు భామలు రొమాన్స్..!

shami
మాస్ మహరాజ్ రవితేజ హీరోగా సుధీర్ వర్మ డైరక్షన్ లో వస్తున్న సినిమా రావణాసుర. క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్న రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ డైరక్షన్ లో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత శరత్ మండవ డైరక్షన్ లో రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేస్తునాడు. దీనితో పాటుగా సుధీర్ వర్మ రావణాసుర సినిమా రానుంది. సుధీర్ వర్మ కొద్దిపాటి గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమాగా రావణాసుర సినిమాని ఎంతో ఫోకస్ తో ప్లాన్ చేస్తున్నారట.
సంక్రాంతి నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. ఇక సినిమాలో రవితేజ సరసన ఒక్కారు ఇద్దరు కాదు ముగ్గురు భామలు రొమాన్స్ చేస్తారని తెలుస్తుంది. రవితేజ సినిమాల్లో హీరోయిన్స్ అంటే గ్లామర్ షో అదరగొట్టేయడం ఖాయం. అందుకే రావణాసుర సినిమాలో ముగ్గురు హాట్ భామలని సెలెక్ట్ చేశారట. నభా నటేష్, ఫరియా అబ్ధుల్లా, మేఘా ఆకాష్ ఈ ముగ్గురు హీరోయిన్స్ రవితేజతో రొమాన్స్ చేస్తారని తెలుస్తుంది.
క్రాక్ తో మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చిన రవితేజ ఇక మీదట సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉండాలని ఫిక్స్ అయ్యారు. ఫ్లాప్ పడితే మళ్లీ హిట్టు పడే దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అదేదో సినిమాకు సైన్ చేసే టైం లోనే బాగా ఆలోచించాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే స్టోరీకి ప్రాధాన్యత ఇచ్చి ముందుకు దూసుకెళ్తున్నాడు. రాబోతున్న ఖిలాడి, రామారావు, రావణాసుర ఈ సినిమాను రవితేజ హిట్ మేనియా కొనసాగిస్తాయా లేదా అన్నది చూడాలి. సినిమాల లైనప్ చూస్తుంటే ఈసారి మాస్ రాజా వరుస హిట్లతో అదరగొడతాడని అనిపిస్తుంది. కథలే కాదు సినిమా టైటిల్స్ కూడా ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. మరి రవితేజ నుండి రాబోతున్న ఈ మూడు సినిమాలు ఎలా ఉండబోతాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: