ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు ఉన్న అంత ఇప్పుడు లేదు.. అప్పుడు ఏది మంచి అని చెప్పడానికి కొందరు పెద్దలు ఉండేవారు.. వారి మాటలకు చిన్న వాళ్ళు కట్టుబడి ఉండే వాళ్ళు. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపొయింది. కానీ ఇప్పుడు అలా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు.ఈ విషయం పై టాలివుడ్ లో పలు చర్చలు జరుగుతున్నాయి. ఇండస్ట్రీ కి పెద్దగా ఎవరొకరిని నిలబెట్టుకొవాలని అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు.తెలుగు సినీ ఇండస్ట్రీలో సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఎవరు వ్యవహరిస్తారు అన్న అంశంపై చర్చ జరుగుతోంది. ఈ విషయంలో చిరంజీవి సినీ పెద్దగా ఇస్తే బాగుంటుంది అని పలువురు సెలబ్రిటీలు అనుకున్నారు.
ఈ విషయం పై చిరు స్పందించారు.. తాను సినీ పరిశ్రమకు పెద్దగా వ్యవహరించనని.. ఒకవేళ ఇండస్ట్రీకి సమస్య వస్తే బిడ్డగా బాధ్యత తీసుకుంటారని తప్ప పంచాయతీలు చేసే పెద్దరికం తనకు వద్దని తెలిపారు. ఈ విషయంపై ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చే నడుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా సినీ పరిశ్రమలోనే పెద్దరికం సమస్య గురించి ఒక ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి మాట్లాడం జరిగింది.
ఈ సందర్బంగా మాట్లాడుతూ.. చిరంజీవిని నోటికి వచ్చినట్లు అన్నది.మీ పెద్దరికం ఎవడు అడిగాడు? బోడి పెద్దరికం.. నాకు అర్థం కాదు.. మీరు మీరు పెద్దరికం తీసుకున్నట్లున్నారు. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే చాపర్ ఫ్లైట్ వేసుకుని వీళ్లు బయలుదేరి పోతారు. బ్రౌసర్ కి వచ్చిన సమస్యలు డిస్ట్రిబ్యూటర్ కి వచ్చిన సమస్యలు అలాగే థియేటర్ ఓనర్స్ కి వచ్చిన సమస్యలు కావచ్చు. ఎలాంటి విషయాలను ఎవరితో మాట్లాడాలి అనేది. ఇండస్ట్రీ కి పెద్ద ఎవరూ అవసరం లేదు. ఏపీ ప్రభుత్వాన్ని ఎవరైతే చీఫ్ చేస్తున్నారో, మీరెవరు కూడా పెద్ద మనుషులు కాదు. మొత్తానికి ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్ గా నేను చెప్పేది ఏమిటంటే నిర్మాతలకు ఏ సమస్యలు ఉన్నా ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు రండి. సమస్య చెబితే అక్కడున్న వారందరూ కూడా సపోర్ట్ చేస్తారు.. అంతేకానీ చేత కాని వాళ్ళను ఎందుకు సింహాసనం ఎక్కించాలని అనుకుంటారు అని ఓ రెంజులొ రెచ్చిపోయింది.ఇది కాస్త సోషల్ మీడియాలొ రచ్చచెస్తుంది..మరోసారి మెగా ఫ్యాన్స్ నోటికి పని చెప్పింది. ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి..