మహానటి సావిత్రికి - రేఖాకి మధ్య సంబంధం ఏంటో తెలుసా..??

N.ANJI

తమిళ ఇండస్ట్రీలో అప్పటి స్టార్ హీరోలంటే.. ఎంజీఆర్, శివాజీ గణేశన్ పేరు వినిపించేది. వీరి తర్వాతి స్థానంలో గణేశన్ ఉండేవారు. గణేశన్.. జాతీయ స్థాయిలో అవార్డులు రాకపోయినా.. ఈయనకు ప్రేక్షకులు రొమాంటిక్ హీరో అనే బిరుదు ఇచ్చారు. టాలీవుడ్‌లో చిరంజీవితో కలిసి ‘రుద్రవీణ’, కమల్ హాసన్‌తో కలిసి ‘భామనే సత్య భామనే’ సినిమాలో నటించారు. వెండి తెరపై గణేశన్ ఎంతో రొమాంటిక్‌గా కనిపించినా.. రియల్ లైఫ్‌లోనూ ఇదే తంతూను కొనసాగించారు. రియల్ లైఫ్‌లో జెమిని గణేశన్ ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆ నలుగురు భార్యలల్లో ముగ్గురు భార్యలకు సంతానం ఉంది. అందులో ఏడుగురు ఆడపిల్లలు.. ఒక అబ్బాయి ఉన్నారు.

 

గణేశన్.. మొదటి భార్య పేరు అలవేలు. ఆమెకు నలుగురు కుమార్తెలు. డాక్టర్ జయశ్రీధర్, డాక్టర్ రేవతి స్వామినాథన్, డాక్టర్ కమలా సెల్వరాజ్, నాయయణి గణేశన్. రెండవ భార్య పుష్పవల్లి ఈమెకు ఇద్దరు కుమార్తెలు. బాలీవుడ్ నటి రేఖా, రాధా సయ్యద్‌లు. మూడవ భార్య మహానటి సావిత్రి. ఈమెకు విజయ చాముండేశ్వరి, సతీష్‌ సంతానం. అలా గణేశన్‌కు ఎనిమిది మంది సంతానం. ఇంతమందిని పెళ్లి చేసుకున్న గణేశన్‌కు తన వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని చెప్పుకొచ్చారు. అయితే బాలీవుడ్ నటి రేఖకు, టాలీవుడ్ మహానటి సావిత్రికి మధ్య ఎలాంటి సంబంధమో ఇప్పుడు తెలుసుకుందాం.


మహానటి సావిత్రి, బాలీవుడ్ స్టార్ సీనియర్ నటి రేఖాకు పిన్ని వరుస. గణేశన్ మూడవ భార్య సావిత్రి. సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె పేరు అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. కానీ రేఖా గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు వెండితెర సెన్సెషనల్‌గా పేరు తెచ్చుకున్నారు రేఖా. అప్పట్లోనే లవ్ ఎఫైర్లు, సీక్రెట్ మ్యారేజ్‌లు చేసుకుని హాట్ టాఫిక్‌గా నిలిచారు. వాస్తవానికి రేఖా గురించి బయటి ప్రపంచానికి తెలిసింది కొన్ని విషయాలే. కానీ బయటికి రాని చీకటి కోణాలు చాలానే ఉన్నాయని బాలీవుడ్ టాక్. యాస్సెర్ ఉస్మాన్ రచయిత రేఖా ఆత్మకథను కూడా రాశారు. ‘రేఖా.. ది అస్‌టోల్డ్ స్టోరీ’ పేరిట బుక్ కూడా ప్రచురితమైంది. ఈమె గురించి తెలుసుకోవాలంటే.. ఆ బుక్ కొనుక్కొని చదవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: