మ‌న టాలీవుడ్ హీరోలు ఏయే వయసులో పెళ్లి చేసుకున్నారో తెలుసా?

VUYYURU SUBHASH
సాధార‌ణంగా సినీ ప‌రిశ్ర‌మ‌లో హీరోయిన్లు చాలా లేట్‌గా పెళ్లి చేసుకుంటారు. పెళ్లైతే ఎక్క‌డ అవ‌కాశాలు త‌గ్గిపోతాయో అన్న భ‌యంతో హీరోయిన్లు పెళ్లిని వాయిదా వేస్తూ ఉంటారు. కానీ, హీరోలు మాత్రం అలా కాదు. వివాహం త‌ర్వాత కూడా వారి సినీ కెరీర్ సాఫీగానే సాగుతుంది. అందుకే పెళ్లి వయస్సు రాగానే ప్రేమించి అమ్మాయితోనూ లేదా పెద్ద‌లు చూపించిన ఆమ్మాయితోనూ ఏడ‌డుగులు న‌డిచి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టేస్తుంటారు. అలాగే చిన్న వయస్సులో పెళ్లి చేసుకున్న హీరోలూ ఉన్నారు. మ‌రి వారు ఎవ‌రు..? అస‌లు మ‌న టాలీవుడ్ హీరోలు ఏయే వయసులో పెళ్లి చేసుకున్నారు..?
వంటి ఆస‌క్తిక‌ర విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1.సూపర్ స్టార్ కృష్ణ: త‌క్కువ వ‌య‌సులోనే పెళ్లి చేసుకున్న హీరోల్లో కృష్ణ ఒక‌రు. కృష్ణ 19 ఏళ్లు వ‌య‌స్సులోనే ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు మంజుల‌, మ‌హేష్ బాబు, ప్రియదర్శినిలు జ‌న్మించారు. ఆ త‌ర్వాత కృష్ణ న‌టి, ద‌ర్శ‌కురాలు, నిర్మాత విజ‌య నిర్మల‌ను రెండో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.
2. మెగాస్టార్ చిరంజీవి: ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేక‌పోయినా స్టార్ హీరోగా ఎదిగిన చిరంజీవి ప్రముఖ సీనియర్ కమెడియన్ అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను పెళ్లి చేసుకున్నారు. వివాహ స‌మ‌యానికి చిరు వయస్సు 24 సంవత్సరాలు.
3.నందమూరి బాల‌కృష్ణ: శ్రీ రామదాసు మోటార్ ట్రాన్స్ పోర్ట్ అధినేత అయిన దేవరపల్లి సూర్యరావు గారి అమ్మాయి వ‌సుంధర‌ను బాల‌య్య త‌న‌కు 22 సంవత్సరాల వయసున్నప్పుడు వివాహం చేసుకున్నారు.
4. నాగార్జున‌: అక్కినేని నాగేశ్వ‌ర‌రావు త‌న‌యుడైన నాగ్ 24 సంవత్సరాల వయస్సులో విక్ట‌రీ వెంక‌టేష్ సోద‌రి లక్ష్మిని వివాహం చేసుకోగా.. వీరికి నాగ చైత‌న్య జ‌న్మించాడు. ఆ త‌ర్వాత నాగార్జున ల‌క్ష్మికి విడాకులు ఇచ్చిన అమ‌ల‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే.
5. మ‌హేష్ బాబు: ఈయ‌న 26 ఏళ్ల వ‌య‌స్సులో హీరోయిన్ నమ్రతా శిరోద్కర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆస‌క్తికర విష‌యం ఏంటంటే మ‌హేష్ కంటే న‌మ్ర‌త నాలుగేళ్లు పెద్ద‌ది.
6. ఎన్టీఆర్‌: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ 2011లో లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నాడు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. ఇక పెళ్లి చేసుకునే స‌మ‌యానికి ఎన్టీఆర్ వ‌య‌స్సు 27 సంవ‌త్స‌రాలు.
7. అల్లు అర్జున్: స్నేహరెడ్డిని ప్రేమించిన బ‌న్నీ ఆపై పెద్ద‌ల‌ను ఒప్పించి ఆమెను వివాహం చేసుకున్నాడు. అప్ప‌టికి బ‌న్నీ వ‌య‌స్సు 28 ఏళ్లు. ఇక ఈ దంప‌తుల‌కు అయాన్‌, అర్హ‌లు జ‌న్మించారు.
8. రామ్ చ‌ర‌ణ్‌: చిరంజీవి అడుగుజాడల్లో హీరోగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన చ‌ర‌ణ్‌.. అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసనను ఐదేళ్లు ప్రేమించి మరీ 26 ఏళ్ల వ‌య‌స్సులో పెళ్లి చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: