ఛీఛీ:వారి పొట్ట కొడుతున్న మన హీరోయిన్లు..కారణం..!

Divya
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ఐటెం సాంగ్ ల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొన్ని సంవత్సరాలుగా ఐటెం సాంగులకు కొంతమంది కథా నాయికల్లో ఎంపిక చేయడం జరుగుతూనే ఉన్నది. కాని ఒకప్పుడు అయితే బాలీవుడ్ లో ఉండే కొంతమంది ఐటెం గర్ల్స్ గా పేరు పొందిన వారిని ఎంపిక చేయడం జరుగుతూ ఉండేది. ఇందుకోసం ప్రత్యేకంగా కొంత పారితోషకాన్ని చెల్లించేవారు నిర్మాతలు. అయితే ఇంకా అవసరం అనుకుంటే వారి కోసం సదుపాయాలు కూడా కల్పించేవారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది.. అయితే ప్రస్తుతం ఐటెం గర్ల్స్ కోసం ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు.. ఎందుకంటే మన హీరోయిన్లే ఇప్పుడు వారి స్థానాన్ని తీసుకుంటున్నారు.
భారీ  పారితోషికం అందుకొని కొంతమంది భామలు ముందుకొస్తున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త తగ్గుముఖం పట్టిన భామలే.. ఇలాంటి పనులు చేస్తున్నారు. అలా ముందుగా హీరోయిన్ కాజల్, జనతా గ్యారేజ్ లో నటించింది.. రంగస్థలం సినిమాలో పూజా హెగ్డే నటించింది. ఈమెకు ఈ పాటలో నటించడం బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. శృతి హాసన్ కూడా ఆగడు సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించింది. తాజాగా హీరోయిన్ సమంత కూడా పుష్ప సినిమాలో అదిరిపోయే డ్యాన్స్ తో ప్రేక్షకులను బాగానే అలరించింది.. ఇక చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో కూడా రెజీనా సరికొత్తగా ఐటెం సాంగ్ లో నటిస్తోంది. దీంతో రెజీనా కాస్త లేటుగా ఈ నిర్ణయాన్ని తీసుకుందని చెప్పవచ్చు.. ఈ సినిమాతోనైనా ఈమె ఫేట్ మారుతుందేమో చూడాలి.

మన హీరోయిన్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల బాలీవుడ్ ఐటెం గర్ల్స్ , టాలీవుడ్ లో ఉండే కొంతమంది ఐటెం గర్ల్స్ కు అవకాశాలు రాకుండా వారి పొట్ట మీద కొడుతున్నారు. అయితే ఇందులో కొందరు స్టార్ హీరోయిన్లు ఐటం గర్ల్ గా నటించడం గమనార్హం. మరికొంతమంది ఎలాగో వారి హవా తగ్గిందని ఇలాంటి పాటలలో చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: