ఈ మధ్య తెలుగు సినిమాల లో ఐటమ్ సాంగ్స్ బాగా ఫెమస్ అవుతూన్నాయి.. ముఖ్యంగా స్టార్ హీరోయిన్లుగా చేస్తున్న పాటల గురించి ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు.. సినిమా హిట్ అయిన అవ్వక పోయిన ఆ పాటలు మాత్రం సూపర్ హిట్ అవుతున్నాయి.. ఇటీవల విడుదల అయిన పుష్ప సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేసింది. అది ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా అదే చెస్తుంది. సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలలొ నటించిన రెజినా ఇప్పుడు ఐటమ్ సాంగ్ లో నటించింది.
సోషల్ ఎలిమెంట్స్ ను పక్కా కమర్షియల్ స్క్రీన్ ప్లేలో జోడించి ప్రేక్షకులకు కిక్కిచ్చేలా సినిమాను తెరకెక్కించే దర్శకుడు కొరటాల శివ ఇప్పుడు ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజివి ప్రధాన పాత్రలో నటిస్తూన్నారు.. దాదాపు అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల కోసం రెడీగా ఉంది. మెగాస్టార్ చిరు, కాజల్ అగర్వాల్ కలిసి నటిస్తుండగా.. రామ్ చరణ్-పూజ హెగ్డే మరో ప్రధాన ప్రత్యేక పాత్రలలో నటిస్తున్నారు.
ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, సాంగ్స్ రిలీజ్ అయి సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరొసాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.సానా కష్టం వచ్చిందే మందాకిని అంటూ సాగే ఈ పాటలో హీరోయిన్ రెజీనా చిరంజీవితో కలిసి స్టెప్పులేయడం విశేషం.. ఈ పాట లో పాత చిరంజీవిని మళ్ళీ చూడవచ్చు..భాస్కర్ భట్ల రచించగా సింగర్ రేవంత్ గీతామాధురి పాడారు.ఈ పాట తో రెజీనా కూడా ఐటెం సాంగ్స్ చేసిన హీరోయిన్స్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. ఇక 'ఆచార్య' సినిమా ఫిబ్రవరి 4న విడుదలవుతుందని మేకర్స్ ప్రకటించారు. రెజినా కూడా ఆ లిస్ట్ లోకి చేరింది..ఒకసారి ఆ పాటను వినండి.