మెగాస్టార్ చిరంజీవి..సూపర్ స్టార్ రజనీకాంత్ .. బిగ్ బి అమితాబ్ బచ్చన్ లాగా కష్టపడి స్వయంకృషితో ఎదిగిన హీరోలు అరుదు. అయితే అలాంటి అరుదైన హీరోగా టాలీవుడ్ సీనియర్ హీరో మాస్ మహారాజా రవితేజ పేరు టాలీవుడ్ హిస్టరీలో లిఖితమై ఉంది.లేట్ వయస్సులో బరిలో దిగినా లేటెస్టుగా సత్తా చాటిన హీరోగా మాస్ ఎనర్జిటిక్ హీరోగా ఆయనకంటూ ఒక రేంజుంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ని ప్రారంభించి అటుపై వన్ ఫైన్ డే హీరోగా టర్న్ అయ్యి స్టార్ హీరోగా రూపాంతరం చెందిన వైనం ఒక సినిమా స్టోరీలా ఉంటుందంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి.ఇప్పటికిప్పుడు హీరో బయోపిక్ తీస్తే రవితేజ స్టోరి సరిపోతుందేమో! అనేంతగా ట్విస్టులు టర్నులు ఆయన జీవితంలో ఉన్నాయి.తాజాగా అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కే షోలో ఇలాంటి ఎన్నో విషయాల ప్రస్థావన అనేది వచ్చింది.
ఆహాలో వస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో గ్లింప్స్ ఒకటి మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. బాల కృష్ణ ప్రశ్నలకు చకచకా సమాధానాలిచ్చేస్తున్న రవితేజ తన వెనక పాలిటిక్స్ గురించి తాను అవకాశాలిచ్చి ప్రోత్సహించిన దర్శకుల గురించి కూడా మాట్లాడటం జరిగింది.పూరి జగన్నాథ్ వల్ల తనకు ఇడియట్ లాంటి సినిమా వచ్చిందని రవితేజ అన్నారు. ఇడియట్ ఇంకా ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు లాంటి వరుస హిట్లతో దూసుకెళితే.. ఎవడ్రా దూసుకెళుతున్నాడు అని అప్పుడు అన్నారట ఇండస్ట్రీలో. వెనకాల ఉండి రాజకీయాలు చేసింది ఎవరు? అని బాల కృష్ణ రెట్టించి ప్రశ్నించినా .. ఇక అవన్నీ ఇక్కడ ఉంటాయి.. ఇక ఎందుకులెండి.. నేనిక లైట్ తీసుకుంటాను! అంటూ మాస్ మహారాజా రవితేజ సమాధానం దాటవేశారు.బోయపాటి శ్రీను-బాబి -గోపిచంద్ మలినేని సహా ఆరేడుగురు డైరెక్టర్స్ ని తెరకు పరిచయం చేశానని ఇక్కడ ప్రతిభ ఉన్నవారంతా ఉంటారని లేని వారు వెళతారని రవితేజ అన్నారు.