వెల్కమ్ టు సుందరం వరల్డ్.. నాని28 టీజర్ ఇంప్రెసివ్..!

shami
నాచురల్ స్టార్ నాని హీరోగా రీసెంట్ గా వచ్చిన శ్యాం సింగ రాయ్ సినిమా నాని సత్తా ఏంటన్నది చూపిస్తుంది. సినిమాలో నాని నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. సినిమాలో సాయి పల్లవి మరోసారి మరో అద్భుతమైన పాత్రలో మెప్పించగా కృతి శెట్టి కూడా గ్లామర్ తో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా హంగామా కొనసాగుతుండగా నాని నెక్స్ట్ సినిమా అంటే సుందరానికీ నుండి కొత్త ఫస్ట్ టీజర్ వచ్చింది. సినిమాలో తన పాత్రని పరిచయం చేస్తూ నాని వాయిస్ తో అంటే సున్రానికీ టీజర్ వచ్చింది.
టీజర్ లో పెద్దగా ఏమి రివీల్ చేయలేదు కాని సినిమా మాత్రం పక్కా ఎంటర్టైనర్ గా వస్తుందని అర్ధమవుతుంది. వెల్కం టు సుందరం వరల్డ్ అంటూ నాని వాయిస్ ఓవర్ మెప్పించింది. సినిమాలో సుందర ప్రసాద్ గా నాని నటిస్తున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నజ్రియా హీరోయిన్ గా నటిస్తుంది. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సౌత్ అన్ని భాషల్లో రిలీఎజ్ చేస్తారని టాక్.
ఇక పంచె కట్టుతో సుందరం లుక్ అదిరిపోయింది. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలతో దర్శకుడిగా ప్రతిభ చాటిన వివేక్ ఆత్రేయ నానితో అంటే సుందరానికీఎ అంటూ మరోసారి అలరించడానికి వస్తున్నాడు. సినిమాలో నాని పాత్ర చాలా వెరైటీగా ఉంటుందని అంటున్నారు. నాని చేస్తున్న ఈ ఎంటర్టైనర్ మూవీ ఆడియెన్స్ ను మెప్పించేలా ఉంటుంద్దని చెబుతున్నారు. నాచురల్ స్టార్ నాని 28వ సినిమాగా వస్తున్న అంటే సుందరానికీ సినిమాలో చాలా సర్ ప్రైజులు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాను 2022 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా నాని దసరా సినిమాలో నటిస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా పీరియాడికల్ స్టోరీగా రాబోతుందని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: