ఆ లక్ తోనే చరణ్ ఇంత ఎదిగాడా..?

VUYYURU SUBHASH
స్టార్ హీరో కొడుకు అయినంత మాత్రాన తాను స్టార్ హీరో అవ్వాలని ఎప్పుడు ఆలోచించలేదు..తన వల్ల తన తండ్రికి చెడ్డ పేరు రాకుండా ..తన గౌరవాని మరో మెట్ట్లు ఎక్కించాలని అనుకున్న హీరో మెగా పవర్ స్టార్ రాం చరణ్. యస్..నిజమే ఈయన మెగా వారసుడు..తండ్రి పేరు చెప్పుకుని సినిమాలోకి వచ్చాడు..తండ్రి హెల్ప్ తోనే స్టార్ డైరెక్టర్స్ ఈయన తో సినిమా చేస్తున్నారు అనుకుందాం.
ఎంత  స్టార్ హీరో కొడుకు అయినా కానీ ఆయనలో టాలెంట్ లేకపోతే ఎన్ని రోజులు అభిమానులు చరణ్ ని ఆదరిస్తారు..? ఎంత కాలం ఆయనకు సపోర్ట్ చేసారు..? లైఫ్ లో సెటిల్ అవ్వడానికి తండ్రిగా చిరంజీవి తన కొడుకి ఈ దారిలో వెళ్లు సక్సెస్ అవుతావు అని చెప్పడం తప్పు కాదే. ఏ తండ్రి అయిన తన కొడుకు జీవితం బాగుండాలి అనే కోరుకుంటాడు..నేను పడిన బాధలు నువ్వు పడకు అనేలా చూసుకుంటారు. ఇక చిరంజీవి కూడా అదే చేస్తూ ఉండచ్చు..దానిలో పెద్ద తప్పు లేదు కదా అని అభిమానులు మెగా ట్రోలర్స్ ని సూటిగా ప్రశ్నిస్తున్నారు.
రాం చరణ్ కెరీర్ లోను అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. తన నటనలోని ప్లస్ లు మైనస్  లు ఎప్పటికప్పుడు సెట్ చేసుకుంటూ సినిమా సినిమాకి తన యాక్టింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ..నేడు పాన్ ఇండియా మూవీ చేసే స్దాయికి ఎదిగాడు చరణ్. ఇదంతా ఆయనలో టాలెంట్ లేకుండానే చేసారా..? ఇండస్ట్రీలో వారసత్వం  ఉన్న మాట నిజమే.. కానీ అలా వారసత్వంగా వచ్చిన అందరు హీరోలు సక్సెస్ కాలేకపోయారు అది కూడా ఇక్కడ గుర్తించాల్సిన విషయం. . ఇక మెగా ఇంటి నుండి హీరోయిన్ గా అడుగు పెట్టిన నాగ బాబు కుమార్తె నిహారిక కూడా హీరోయిన్ గా రాణించలేకపోయింది.  ఆమె ఎన్ని సినిమాలు చేసినా అవి ఆకట్టుకునేలా లేకపోవడంతో నిహారికకు సక్సెస్ ఇవ్వలేదు అభిమానులు అనే విషయం కూడా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమే.  
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: