ఆర్ఆర్ఆర్: నా సగం అతడు ఎంత గొప్పమాట నచ్చావురా చరణ్ !
మంచి కొందరికే కొందరిదే
అనుబంధం కూడా కొందరికే కొందరిదే
అందుకే జీవితం కొన్ని బంధాలే కోరుకుంటుంది
బంధాలకు అతీతంగా కొన్నింటిని మాత్రమే
ఎంచుకుంటుంది
మాది అనురాగ బంధం అన్నదమ్ముల బంధం
అని అంటున్నారు చరణ్..
దేవుడు ఇచ్చిన వరం ఇది అని అంటున్నారు తారక్
దేవతలు నడయాడిన చోట చెంత ఉంటూ
కేరళ తీరాన ఉంటూ...
ఆర్ఆర్ఆర్ విజయాన్ని స్వప్నిస్తూ స్వప్న సాకారాన్ని ప్రేమిస్తూ
స్వప్న సాకార సాక్షాత్కార రూపాన్ని ప్రేమిస్తూ
ఏ కథకుడు అయినా ఏ కథానాయకుడు అయినా చేయాల్సింది ఇదే!
సుందర తీరం త్రివేండ్రం.. ఇద్దరు వీరులు తమ కథ చెబుతాం అని అంటున్నారు. మా తెలుగు కథ మీరు వినాలి. విన్నాక మీరంతా పొంగిపోవాలి.. అయినా అత్యున్నత సృజనకు ఆనవాలుగా నిలిచే ఈ ప్రాంతంకు మేం మోకరిల్లుతూనే మా కథను చెబుతున్నాం అంటూ నిన్నటి వేళ ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ వేడుకల్లో ఆ ఇద్దరూ ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు. ఇద్దరు పెద్ద హీరోలు ఒక ఫ్రేమ్ లో.. కథకు ఎక్కడ ఇబ్బంది కాకూడదు. కథన రీతిలో ఎటువంటి అడ్డంకులూ ఉండకూడదు..ఇలాంటి కొన్ని నియమాలతో ఈ సినిమా ప్రారంభం అయి అనేక దశలు అనేక అవరోధాలు దాటి ఈ జనవరి ఏడున ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు నోచుకోనుంది. అన్ని భాషల్లోనూ ఈ సినిమాకు అలరించే అంశాలు ఉన్నాయి. అందరినీ ఆకట్టుకునే విశేషాలు ఇందులో ఉన్నాయి. అందుకే ఇది ప్రపంచ సినిమాల జాబితాలో చేర్చడం అని అంటున్నారు దర్శక ధీర.. ఇక నిన్నటి వేడుకకు ఆ రెండో స్వర్గం చెంత ఆ దేవతలు నడయాడిన చోటు ఇద్దరు హీరోలు.. ఎంత బాగా మాట్లాడారో! అవును! తారక్ నా జీవితంలో తెలిసిన అర్థవంతం అయిన అర్ధ భాగం అని అన్నారు. ఈ ఒక్క మాట వింటే అభిమానులకు పూనకాలే!