ఆర్. ఆర్. ఆర్ విడుదలపై ఎలాంటి అనుమానాలు వద్దంటున్న రాజమౌళి..!

murali krishna
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్యమైన పాత్రల్లో దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్' అని అందరికి తెలిసిందే... అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 7న విడుదలకు సిద్ధంగా ఉంది.

అయితే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడుతుందేమో అనే అనుమానాలు మొదలయ్యాయి.

చాలా రాష్ట్రాల్లో కర్ఫ్యూలు విధించడం అలాగే కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడం, థియేటర్ పై విదిస్తున్న ఆంక్షలు.. ఇన్ని సమస్యల మధ్య రాజమౌళి తన సినిమాను రిలీజ్ చేస్తారా అనే సందేహాలు చాలా మందిలో కలిగాయి. తాజాగా ఈ విషయంపై క్లారిటీ వచ్చేసిందని తెలుస్తుంది.ప్రముఖ సినీ విమర్శకుడు అయిన తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేసారు.అందులో రాజమౌళి రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చినట్లు చెప్పారని సమాచారం.

 

జనవరి 7నే పక్కాగా సినిమా విడుదలవుతుందని రాజమౌళి తనతో చెప్పారని రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని ఆయన క్లారిటీ ఇచ్చారు. సో.. 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ విషయంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోవలసిన పని లేదు.వెండితెరపై ఈ విజువల్ వండర్ ని చూడడానికి అందరూ రెడీ అయిపోవచ్చు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేస్తున్నారు.

 అందుకే ముంబై మరియు చెన్నై అలాగే కేరళ ఇలా చాలా రాష్ట్రాల్లో సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తున్నారని కానీ నార్త్ సైడ్ ఇప్పటికే నైట్ కర్ఫ్యూలు వచ్చేశాయి కాబట్టి సినిమా కలెక్షన్స్ పై ఆ ప్రభావం పడే ఛాన్స్ ఉంది. ఏపీలో కూడా అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ వస్తాయో లేదో చూడాలి మరి.ఇదే విధంగా కేసులు పెరిగినట్లు కనుక అయితే . ఆర్.ఆర్ నిజంగానే వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తుంది.మరి రాజమౌళి ఇచ్చిన మాట మీద నిలబడతాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: