ఓటిటిలో రాధేశ్యామ్.. షాక్ లో డార్లింగ్ ఫ్యాన్స్ ..

Purushottham Vinay
బాహుబలి లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాతో పాన్ ఇండియా స్టార్‎గా మారిపోయాడు రెబల్ స్టార్ ప్రభాస్.ఇక ఈ మూవీతో డార్లింగ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు.డార్లింగ్ ప్రభాస్ ‏తో సినిమా చేసేందుకు బాలీవుడ్ ఇంకా అలాగే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందుకే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో ఆదిపురుష్ సినిమా చేస్తున్నారు.ఇంకా మరోవైపు.. కేజీఎఫ్ లాంటి సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమాని కూడా చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే.. ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇటీవలే ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా ఘనంగా నిర్వహించారు. ఇక ఈమధ్య విడుదలైన ఈ మూవీ ట్రైలర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ప్రభాస్ నుంచి సినిమా రాబోతుండడంతో రాధేశ్యామ్ సినిమాపై అంచనాలు బాగా భారీగానే ఉన్నాయి. 1960 శాతాబ్దం నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నారట మూవీ మేకర్స్.ఇక ప్రస్తుత పరిస్థితులలో థియేటర్ల కంటే ఓటీటీలో విడుదల చేయడమే బెటర్ అని నిర్మాతలు కూడా భావిస్తున్నారట. ఈ విషయంపై త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటించనున్నట్లుగా సమాచారం తెలుస్తోంది.ఇదిలా ఉండగా ప్రస్తుతం దేశంలో ఓమిక్రాన్ వ్యాప్తి అనేది క్రమంగా పెరుగుతోంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో టికెట్స్ విషయంలో థియేటర్స్ యాజమానులుకు ఇంకా అలాగే ప్రభుత్వాలకు మధ్య కూడా ఇప్పుడు రగడ జరుగుతోంది. ఇక ముఖ్యంగా ఏపీలో టికెట్స్ రేట్స్ తగ్గిస్తూ జీవో జారీ చేయడంతో సినీ ప్రముఖులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ప్రభుత్వం ఆలోచించాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: