వామ్మో..'ఆహా'తో శ్రీరామచంద్ర కళ్లు చెదిరే డీల్..?
ఈయన హౌస్ లో ఉండగా చాలా మంది సెలబ్రిటీస్ సైతం ఆయనకు ఓటు వేసి గెలిపించండీ అంటూ సపోర్ట్ చేశారంటేనే ఆయన మంచితనం ఫాలోయింగ్ మనం అర్ధంచేసుకోవచ్చు. ఇక పాన్ ఇండియా హీరో ప్రభాస్ పెద్దమ్మ కూడా శ్రీరామ చంద్రకు సపోర్ట్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసి తన సపోర్ట్ శ్రీరామచంద్రకే అంటూ తెలిపింది. ఇక ఫైనల్ గా టాప్ 3 ప్లేస్ తో సరిపెట్టుకున్న ఈయన..అభిమానుల మనసుల్లో మాత్రం నెం 1 స్దానాని గెలుచుకున్నాడు. ఇక హౌస్ నుండి బయటకు వచ్చిన శ్రీరామ చంద్ర కు వరుస ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తుంది.
ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఆహా' ప్రేక్షకులకు సరికొత్త రీతిలో ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరో సరికొత్త సింగింగ్ షో కి ప్లాన్ చేసిన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సింగింగ్ షోకి హోస్ట్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీరామ చంద్ర ఫైనల్ ను చేసిన్నట్లు టీం అధికారికంగా ప్రకటించింది. తర్వలో 'ఇండియన్ ఐడల్' పేరుతో మొదలు కానున్న బిగ్గెస్ట్ సింగింగ్ షోకి హోస్ట్‌గా శ్రీరామచంద్రను సెలెక్ట్ చేసిన్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించారు ఆహా మేకర్స్.ఇప్పటి వరకు సింగర్‌గా అలరించిన శ్రీరామచంద్ర ఇక పై హోస్ట్‌గా ఎలా మెప్పిస్తాడో చూడాలి. ఇక ఈ షోని హోస్ట్ చేస్తున్నందు గాను ఆహా శ్రీరామ చంద్రకు కళ్ళు చెదిరే పారితోషంతో డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది.