య‌థాత‌థం : ‘రాధేశ్యామ్’ విడుద‌లపై క్లారిటీ.. ఎప్పుడంటే..?

N ANJANEYULU
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పాన్ ఇండియా రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ రాధేశ్యామ్ ఇప్పుడు నిర్మాణ ప్ర‌క్రియ చివ‌రి ద‌శ‌లో ఉన్న‌ది. ఈ చిత్రాన్ని ఒమిక్రాన్ నేప‌థ్యంలో వాయిదా వేస్తార‌ని ప‌లు వార్త‌లు వినిపించాయి. ఎట్ట‌కేల‌కు చిత్ర‌బృందం స్పందించి.. 2022 జ‌న‌వ‌రి 14న ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల అవ్వ‌నున్న‌ట్టు తెలిపింది. ప్ర‌స్తుతం ఈ చిత్ర ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌కుమార్ రాధేశ్యామ్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను ఆస‌క్తిక‌ర‌మైన అప్‌డేట్ ఇచ్చారు.
ట్రైల‌ర్‌లో చూసిన వీఎఫ్ఎక్స్ వ‌ర్క్‌కు అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతూ ఉన్నారు. ముఖ్యంగా క్రెడిట్ మొత్తం వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్ కమల్ కణ్ణన్‌కే చెందుతుంది అని ప్ర‌క‌టించారు. సినిమా కోసం అత్యుత్తమ ఔట్‌ పుట్ అందించడానికి వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు అని చెప్పారు. రాధే శ్యామ్ వీఎఫ్ఎక్స్ పనులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12 దేశాల్లో జరుగుతున్నాయ‌ని రాధా కృష్ణ పేర్కొన్నారు.
ముఖ్యంగా రాధేశ్యామ్ వీఎఫ్ఎక్స్ ప‌నులు 12 దేశాల‌లో జ‌రుగుతున్నాయ‌ని ద‌ర్శ‌కుడు పేర్కొన‌డం చూస్తుంటే సినిమా ఏ రేంజ్‌లో ఉండ‌నున్న‌దో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌రే లేదు.  ప్ర‌భాస్‌, పూజా హెగ్దే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టించిన రాధేశ్యామ్ యూవీ క్రియేష‌న్స్ భారీ బ‌డ్జెట్ రొమాంటికి ఎంట‌ర్ టైన‌ర్ గా రూ.200కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న‌ది. అయితే ఒమిక్రాన్ ఆందోళ‌నల మ‌ధ్య సినిమా విడుద‌ల‌వుతుందా..? లేక వాయిదా ప‌డుతుందా..? అనుకున్న స‌మ‌యానికే వ‌స్తుందా..? అంటే అది నిర్మాత‌ల చేతుల‌లో ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ చెప్పుకొచ్చారు. అంద‌మైన విజువ‌ల్ క‌థ‌నాన్ని అందిస్తారు అని, పెద్ద స్క్రీన్‌ల‌పై మిస్ కాకూడ‌దు అని సినిమాటోగ్ర‌ఫ‌ర్ మ‌నోజ్ ప‌ర‌మ‌హంస పేర్కొన్నారు.
బిజిఎమ్ స్కోర్ చేయడానికి  సంగీత ద‌ర్శ‌కుడు థమన్‌ని స్వాగతిస్తున్నాను అని తాజాగా ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసారు. అదేవిధంగా రాధేశ్యామ జ‌న‌వ‌రి 14, 2022న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో విడుద‌ల‌వుతున్న‌ట్టు పోస్ట‌ర్ పై వెల్ల‌డించారు మూవీ మేక‌ర్స్‌. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: