నానితో ఆ సీన్..వణికిపోయా.. ఓపెన్ గా చెప్పేసిన బేబమ్మ..!!

VUYYURU SUBHASH
కన్నడ సోయగం కృతి శెట్టిని అభిమానులు ముద్దుగా బేబమ్మ అని పిలుచుకుంటుంటారు. ఉప్పెన సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఫస్ట్ సినిమాతోనే టాప్ హీరోయిన్ ల లిస్ట్ లో చేరడమే కాకుండా..భారీ స్దాయిలో ఆఫర్స్ అందుకుంటూ..అంతకంటే భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ప్రస్తుతం చేతిలో నాలుగు బడా ప్రాజెక్ట్స్ ని పట్టుకుని ఉన్న కృతి..త్వరలోనే మెగా హీరో కూడా నటించబోటున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే అమ్మడు కెరీర్ కు ఇక తిరుగుండదు అనే అంటున్నారు సినీ విశ్లేషకులు.
ఇక మెగా మేనల్లుడు వైష్ణవ్ తెజ్ తో ఉప్పెన సినిమాలో నటించిన ఈ అమ్మడు చూసేందుకు సైలెంట్ గా అనిపించిన లోపల చాలా మ్యాటర్ ఉన్నట్లు ఆమె నటించిన రెండో సినిమా శ్యాం సింగరాయ్ విడుదల అయ్యాకనే తెలిసింది. మొదటి సినిమా ఏదో లక్ కొద్ది హిట్ అయ్యిందిలే అనుకున్నవారికి రెండో సినిమాతో తనలోని నటనను రుచి చూయించింది కృతి. నాని పక్కన హీరోయిన్ గా చేసిన కృతి..శ్యాం సింగరాయ్ సినిమాలో కాస్త మగరాయుడిలా, ఫుల్ ఫైర్  బ్రాండ్ లా,  స్మోకింగ్ చేస్తూ కీర్తి పాత్రలో జీవించేసింది. అంతేకాదు నానితో బెడ్ సీన్స్..  హాట్ సీన్స్ కూడా చేసి షాక్ ఇచ్చింది.
ఇక ఇలాంటి  సీన్స్ గురించి మాట్లాడుతూ కృతి పలు ఆసక్తికర విషయాలను అభిమానులకు తెలియజేసింది. ఆమె మాట్లాడుతూ.."శ్యాం సింగరాయ్ సినిమా కోసం నాకు నచ్చకపోయినా స్మోకింగ్ చేసాను. నాకు స్మోకింగ్ చేయడం నచ్చదు..కానీ డైరెక్టర్ నా క్యారెక్టర్ చెప్పిన్నపుడు నాకు చాలా ఛాలెంజింగ్ గా అనిపించి అలా చేసా. అవి ఒరిగినల్ సిగిరేట్లు కావు. ఆరోగ్య సేతు సిగరేట్లను తీసుకొచ్చి..నా దగ్గర ఆ సీన్  చేయించారు. అందులో ఓన్లీ మిల్క్ టేస్ట్ మాత్రమే ఉంటుంది. మొత్తంగా ఆ సిగరెట్లను తాగడం కోసం మూడు రోజులు ప్రాక్టీస్ చేసి..ఫైనల్ గా షార్ట్ కు రెడీ అయినప్పుడు..నాకు వణుకు వచ్చేసింది" అంటూ కృతి అసలు మ్యాటర్ రివీల్ చేసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: