శ్యామ్ సింగ రాయ్: ఆ స్టార్ హీరో అభిమానుల వల్లే హిట్ టాక్ వచ్చిందా..?

VUYYURU SUBHASH
నేచురల్ స్టార్ నానికి హీరోగా ..సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్ లుగా నటించిన సినిమానే ఈ శ్యామ్ సింగ రాయ్. గత కొంత కాలంగా అభిమానులను ఊరిస్తూ ఊరిస్తూ ఎట్టకేకు నేడు గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ అయ్యింది ఈ సినిమా. నాని గత కొన్ని సినిమాలను ఓటీటీ లో విడుదల చేసి అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న క్రమంలో..ఈ సినిమాని ధియేటర్స్ లో విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు మేకర్స్. ఇక ఈ సినిమా చూసిన జనాలు ఇచ్చే రివ్యూ మామూలూగా లేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ సినిమా గురించి నెగిటివ్ గా చెప్పడంలేదంటేనే ఈ సినిమా ఏ రెంజ్ లో అభిమానులకు నచ్చిందో మనం అర్ధం చేసుకోవచ్చు.
 జంగా సత్యదేవ్ రాసుకున్న కధను డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ ఎక్కడ తడబడకుండా సినిమా చూసే జనాలకు  బోర్ కొట్టకుండా  తనదైన మార్క్ తో తెర పై చూయించి గ్రాండ్ సకెస్ అయ్యారు.  ఈ సినిమాలోని ప్రతి సీన్ అధ్బుతంగా తెరకెక్కించారు శ్యామ్ సింగ రాయ్ డైరెక్టర్. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేసిన  మిక్కీ జే మేయర్ తనదైన శైలిలో మ్యూజిక్ అందించి సినిమాను మరో మెట్టు ఎక్కించారు. ఏ సీన్  కి ఎంత కావాలో అలానే బ్యాక్ గ్రౌండ్  మ్యూజిక్ అందించారు మిక్కీ. ఇక సాయి పల్లవి నటన, డ్యాన్స్ తో మెప్పిస్తే..కృతి శెట్టి గ్లామర్ డోస్ తో అట్రాక్ట్ చేసింది. టోటల్ సినిమాకి ప్రతి ఒక్కరు వాళ్ల క్యారెక్టర్ తో న్యాయం చేసారు. దీంతో బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుంది శ్యామ్ సింగ రాయ్.
అయితే శ్యామ్ సింగ రాయ్ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడానికి కారణం నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అంటు ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది. సినిమా,కధ,నటన పరంగా శ్యామ్ సింగ రాయ్ బాగున్నప్పటికి బాలయ్య అభిమానులు కూడా ఓ రేంజ్ లో పబ్లిసిటీలు చేస్తూ..నాని అభిమానులతో కలిసి రచ్చ రచ్చ చేయడం వల్ల కూడా సినిమా ఈమేర బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడానికి కారణమైందంటూ నెట్టింట ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. హీరో నాని సీనియ‌ర్ హీరో బాల‌య్యకు ఎంత పెద్ద అభిమానినో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దీంతో బాలయ్య ఫ్యాన్స్  ఈ సినిమాకు స‌పోర్ట్ చేస్తూ నానికి ఎంతో సపోర్ట్ ఇచ్చారు. అంతేకాదు శ్యామ్ సింగ రాయ్ హిట్ అవ్వడంతో  బాల‌య్య ఫ్యాన్స్ త‌మ హీరో సినిమా హిట్ అయిన‌ట్టుగా సంబ‌రాలు చేసుకోవడమే కాకుండా  శ్యామ్‌సింగ‌రాయ్ సినిమాను ప్ర‌తి ఒక్క‌రు చూడాల‌ని కామెంట్లు కూడా పెడుతున్నారు. దీంతో ధియేటర్స్ వద్ద నాని-బాలయ్య అభిమానులు సందడి  మామూలుగా లేదు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: