శ్యామ్ సింగ రాయ్ : మళ్లీ వివాదాల్లో మంత్రులు తగ్గండయ్యా?
ఈ తరుణంలో ఈ నేపథ్యంలో.....
జగన్ వ్యూహాలకు అనుగుణంగా ఆంధ్రావనిలో మంత్రులు ఎప్పటికప్పుడు వివాదాల్లోనే ఉంటున్నారు. వివాదాల కోసమే పనిచేస్తున్నారు కూడా! అంతకుమించి వీరు సాధించిందేమీ లేదన్న విమర్శ ఒకటి తరుచూ విపక్షం నుంచి ఎదుర్కొంటున్నారు. తాజాగా శ్యామ్ సింగ రాయ్ వివాదం నేపథ్యంలో మంత్రులు మళ్లీ నోరేసుకుని పడిపోయారు. అప్పుడే సీఎం జగన్ ఆదేశాల మేరకు కక్ష్య సాధింపు చర్యలు కూడా మొదలు పెట్టారు. దీంతో నానీ అభిమానులు కూడా అంతే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మంత్రి బొత్సను, మంత్రి కన్నబాబును ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. సినిమా పరిశ్రమను చంపేద్దాం అన్న ఒకే ఒక్క లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వం వైసీపీదేనని నిన్నటి వేళ జనసేన కార్యకర్తలు వివిధ మీడియా డిబెట్లలో భగ్గుమన్నారు. తమ హీరో పవన్ ను లక్ష్యంగా చేసుకుని జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అన్నీ రేపటి వేళ వారి పతనానికే నాంది అవుతాయని ఫైర్ అవుతున్నారు.