రాధేశ్యామ్ ఈవెంట్.. ప్రభాస్ కన్నా అతను హైలెట్ అయ్యాడు..!

shami
ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. యువి క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటించింది. క్రేజీ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ గురువారం సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది.
ఈ ఈవెంట్ కు యాంకర్ గా జబర్దస్త్ రష్మి చేయగా స్పెషల్ హోస్ట్ గా జాతిరత్నాలు హీరో నవీన్ పొలిశెట్టి అలరించారు. ఆల్రెడీ బాలీవుడ్ లో కూడా అతను సినిమాలు చేసిన అనుభవం ఉండటం వల్ల రాధేశ్యామ్ నేషనల్ ఆడియెన్స్ ను రీచ్ అయ్యేలా నవీన్ పొలిశెట్టి బాగానే మెప్పించాడని చెప్పొచ్చు. అయితే సినిమాలో హీరో ప్రభాస్ కు కూడా లేని ఎంట్రీతో నవీన్ పొలిశెట్టి ఎంట్రీ ఇవ్వడం విశేషం. నవీన్ పొలిశెట్టి కోఅం ఓ క్రేజీ ఏవీతో పాటుగా గ్రాండ్ ఎంట్రీ కూడా ఇప్పించారు. తన సినిమా ఈవెంట్ లో కూడా నవీన్ కి ఇంత క్రేజీ ఎంట్రీ ఇవ్వలేదని చెప్పొచ్చు.
అందుకే రాధేశ్యామ్ ఈవెంట్ లో ప్రభాస్ కన్నా యువ హీరో నవీన్ పొలిశెట్టి హైలెట్ అయ్యాడని చెప్పుకుంటున్నారు. నిన్న జరిగిన ఈవెంట్ తో నవీన్ హోస్టింగ్ టాలెంట్ కూడా బయటపడ్డది. ఈవెంట్ కు వచ్చిన డైరక్టర్స్ అందరిని ఓ ఆట ఆడుకున్నాడు నవీన్ పొలిశెట్టి. అంతేకాదు నేషనల్ వైడ్ గా ప్రభాస్ అందరి ఫ్యాన్స్ కి నవీన్ హాయ్ చెప్పించాడు. రాధేశ్యామ్ ఈవెంట్ లో నవీన్ పొలిశెట్టి హంగామా గురించి హాట్ న్యూస్ గా మారింది. ఈవెంట్ లో తనకు వచ్చిన అవకాశాన్ని నవీన్ పొలిశెట్టి బాగా వాడుకున్నాడని చెప్పొచ్చు. యాంకర్ గా రష్మిని పెట్టుకున్నా సరే షో మొత్తం నవీన్ సింగిల్ హ్యాండ్ తో మ్యానేజ్ చేశాడని చెప్పొచ్చు. కుర్రాడిలో ఉన్న మల్టీ టాలెంట్ ఆడియెన్స్ ను బాగా ఎట్రాక్ట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: